iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో నటించాలని ఉంది! ఆ పాత్ర అయితేనే చేస్తా: నటి రాశి

  • Author ajaykrishna Updated - 03:29 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:29 PM, Thu - 17 August 23
ప్రభాస్ తో నటించాలని ఉంది! ఆ పాత్ర అయితేనే చేస్తా: నటి రాశి

ఒకప్పుడు సినిమా హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన బ్యూటీలంతా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. కొందరు సినిమాలలో తల్లి, అత్త పాత్రలు చేస్తుంటే.. ఇంకొందరు సైలెంట్ గా సీరియల్స్ చేసుకుంటున్నారు. అలా ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగి.. ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తోంది తెలుగు బ్యూటీ రాశి. సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసిన రాశి.. పెళ్లి తర్వాత నటనకు దూరమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అత్త, తల్లి క్యారెక్టర్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రెజెంట్ సీరియల్స్ కూడా చేస్తోంది.

ఇక నటిగా రాశి.. టాలీవుడ్ లో అందరు స్టార్స్ సినిమాలో మెరిసింది. కనీసం స్పెషల్ సాంగ్స్ లో లేదా విలన్ కి సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ అయినా కనిపించి.. అందరు హీరోలను కవర్ చేసింది. కానీ.. తన కెరీర్ ఒకే ఒక్క హీరోతో నటించే ఛాన్స్ మిస్ అయ్యిందని.. అతనితో నటించాలనే ఆశ ఇంకా ఉందని అంటోంది రాశి. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాశి నటిస్తున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఆ సీరియల్ టీమ్ అందరు కలిసి యూట్యూబ్ లో ఓ వ్లాగ్ చేశారు. ఇందులో భాగంగా రాశి.. తన కెరీర్ తో పాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరోల గురించి.. చెప్పుకొచ్చింది.

రాశి మాట్లాడుతూ.. “నా ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోలు శోభన్ బాబు.. ఆ తర్వాత చిరంజీవి. ఇప్పుడున్న స్టార్స్ లో ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటిదాకా ఎవరితోనైనా నటించలేదంటే.. అది ప్రభాస్ తోనే. ఆయనతో నటించాలని ఆశగా ఉంది. కానీ.. ఆయన పక్కన హీరోయిన్ గానే చేయాలి. తల్లిగా అంటే అస్సలు ఒప్పుకోను. నేను ఇప్పటివరకు ప్రభాస్ ను డైరెక్ట్ గా చూడలేదు, కలిసి మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ టైమ్ లో ఒకే హోటల్ లో నేను, ప్రభాస్ ఉన్నాం. ఆయన అక్కడే ఉన్నాడని తెలిసి సంబరపడిపోయాను. అప్పటికి నేను వర్షం సినిమా చూడలేదు. ఈశ్వర్ ట్రైలర్ లో చూసినప్పుడు ప్రభాస్ నచ్చేశాడు. ఇక ప్రభాస్ ని కలవలేకపోయినా.. కనీసం ఫోన్ లో మాట్లాడతా అని ప్రభాస్ ఉన్న రూమ్ కు కాల్ చేశా. వర్షం సినిమా చూడకపోయినా.. మీ సినిమా చాలా బావుంది, మీరు చాలా బావున్నారు అని చెప్పాను. అప్పుడు ప్రభాస్ ఎంతో మర్యాదగా.. థాంక్స్ అండి అన్నాడు.” అని తెలిపింది రాశి. ప్రస్తుతం రాశి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş