iDreamPost
android-app
ios-app

పైరసీ ముఠా అరెస్ట్.. గుడ్ డేస్ వచ్చినట్టేనా !

  • Published Sep 29, 2025 | 12:17 PM Updated Updated Sep 29, 2025 | 12:17 PM

ఈరోజు ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే.. సాయంత్రానికి పైరసీ వచ్చేస్తుంది. ప్రభుత్వాలు , ఇండస్ట్రీ పెద్దలు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా కూడా.. కొత్త సినిమాలపై పైరసీ దెబ్బ పడుతూనే ఉంది. పైరసీని ఎంకరేజ్ చేసేవాళ్లకు కూడా ఎప్పటికపుడు వార్నింగ్ చేస్తూనే ఉన్నారు.

ఈరోజు ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే.. సాయంత్రానికి పైరసీ వచ్చేస్తుంది. ప్రభుత్వాలు , ఇండస్ట్రీ పెద్దలు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా కూడా.. కొత్త సినిమాలపై పైరసీ దెబ్బ పడుతూనే ఉంది. పైరసీని ఎంకరేజ్ చేసేవాళ్లకు కూడా ఎప్పటికపుడు వార్నింగ్ చేస్తూనే ఉన్నారు.

  • Published Sep 29, 2025 | 12:17 PMUpdated Sep 29, 2025 | 12:17 PM
పైరసీ ముఠా అరెస్ట్.. గుడ్ డేస్ వచ్చినట్టేనా !

ఈరోజు ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే.. సాయంత్రానికి పైరసీ వచ్చేస్తుంది. ప్రభుత్వాలు , ఇండస్ట్రీ పెద్దలు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా కూడా.. కొత్త సినిమాలపై పైరసీ దెబ్బ పడుతూనే ఉంది. పైరసీని ఎంకరేజ్ చేసేవాళ్లకు కూడా ఎప్పటికపుడు వార్నింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇలా సినిమా పైరసీని చేస్తూ.. నష్టానికి కలగచేస్తున్న ఆరుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళ గ్యాంగ్ దుబాయ్, మయన్మార్, నెదర్లాండ్ తదితర దేశాల్లో ఉన్నట్టు గుర్తించి వాటిని ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ గ్యాంగ్ అంతా ఓ స్పెషల్ మెకానిజం ని ఏర్పాటు చేసుకుని.. మల్టీప్లెక్సుల్లో , సింగిల్ స్క్రీన్స్ లో కెమెరాస్ ను ఎరేంజ్ చేసుకుని.. షూట్ చేయడం, ఏజెంట్ల ద్వారా ప్రింట్లు బయటికి తేవడం, శాటిలైట్స్ ని సైతం డీ కోడ్ చేసి వాటిని ఆన్లైన్ లో పెట్టడం. ఇవన్నీ ఈ గ్యాంగ్ చేసే అరాచకాలు. రీసెంట్ గా రిలీజ్ అయినా ఓజి సినిమాను సైతం ఆన్లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారి నుంచి మరింత ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారట పోలీసులు.

గత ఏడాది ఇలాంటి పైరసీల వలన.. ఇండస్ట్రీకి సుమారు 22 వేల కోట్ల నష్టం వచ్చిందట. గేమ్ చెంజర్ సినిమా మొదటి రోజే క్లియర్ ప్రింట్ రావడం అందరికి షాక్ ఇచ్చింది. ఇలా ఎన్నో సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఇక ముందు ముందు ఇలాంటి పైరసీలు లేకపోతే సినిమాలకు గుడ్ డేస్ వచ్చినట్టే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.