iDreamPost
android-app
ios-app

Hanuman Movie: హనుమంతుడే ఎవర్ గ్రీన్ మాస్ హీరో.. హిట్టు ఖాయమేనా?

తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ ట్రైలర్ విడుదలై.. సంచలనాన్ని సృష్టిస్తోంది. రాజమౌళి రేంజ్ లో గ్రాఫిక్స్ ను అతి తక్కువ కాలంలో చేసి చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ ట్రైలర్ విడుదలై.. సంచలనాన్ని సృష్టిస్తోంది. రాజమౌళి రేంజ్ లో గ్రాఫిక్స్ ను అతి తక్కువ కాలంలో చేసి చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

Hanuman Movie: హనుమంతుడే ఎవర్ గ్రీన్ మాస్ హీరో.. హిట్టు ఖాయమేనా?

ఆంజనేయుడు, హనుమంతుడు.. పేర్లు ఏమైనా కావచ్చు, ఆ దేవుడి పాత్ర గనక ఏదైనా సినిమాలో ఉన్నాదీ అంటే ఆ సినిమాకి అది కొండంత అండ. కొన్ని సందర్భాలలో అయితే కొంగు బంగారం. గతంలోకి వెళ్లి ఒక్కసారి గుర్తు చేసుకోండి.. మీకే ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తాజా సంచలనం తేజా సజ్జతో ‘హనుమాన్’ కూడా అంతే. ఈరోజే హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజైన క్షణం నుంచే సోషల్ మీడియా అదిరిపడింది. వైరల్ అవడం అంటే ఏమిటో హనుమాన్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

నిజానికి తేజా సజ్జ చాలా అవకాశాలను పక్కనపెట్టి మరీ హనుమాన్ ప్రాజెక్టును అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ తనకి తాను క్రియేట్ చేసుకున్న ఓ స్ట్రాంగ్ ఇమేజ్ హనుమాన్ ప్రాజెక్టుకి సైలెంట్ అట్రాక్షన్ అవుతూ వచ్చింది. టైటిల్ ముందుగా తెగని ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే ఇదేదో హనుమంతుడి క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాగా అంచనాలు మొదలయ్యాయి. తీరా ఇవ్వాళ ట్రైలర్ విడుదలయిన తర్వాత ఒక్కసారిగా దేశం మొత్తం మీద హనుమాన్ సినిమా మీద అంతులేని ఎక్సైట్ మెంట్ అల్లుకుంది.

హనుమాన్ మూవీలో ప్రతీ ఒక్క విజువల్ సుపర్బ్.. ప్రతీ ఫ్రేమ్ ఒక అద్భుతం.. క్యారెక్టర్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతుంటే మనం కూడా కథ జరుగుతున్న ప్రాంతంలోనే తిరుగాడుతున్న ఒక ఫీలింగ్.. పైగా ట్రైలర్ ప్రారంభంలోనే యతో దర్శస్తతో హనుమాన్, యతో హనుమాన్ తతో జయహ.. అనే బేస్ వాయిస్ బిగ్గరగా వినపించగానే ట్రైలర్ రేంజే మారిపోయింది. రన్నింగ్ షాట్స్ లో హనుమంతుడి విగ్రహం ఓపెన్ అవుతుంటే అలజడి ఉప్పోంగుతుంది. హీరో తేజా సజ్జ అర్భకుడు, కానీ ధర్మానికి వెన్ను కాయాలి.. ఎలా? అంత శక్తిసామర్ధ్యాలు ఎక్కడ నుంచి వస్తాయి? అక్కడే ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్రని ఎంటర్ చేశాడు. అంతే.. ట్రైలర్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది.

ఆ ఎఫెక్ట్ ని మరింత పెంచుతూ, ఓ రుషి హనుమంతుడిని ఉద్దేశించి, ధర్మ రక్షణ జరగాలంటే నువ్వు రావాల్సిందే హనుమా అన్న పిలుపు తర్వాత మంచు పర్వతం ఒక్కసారిగా బద్దలై, అందులో నుంచి హనుమంతుడు ప్రత్యక్షమవుతుంటే.. ఒళ్లు జలదరిస్తుంది. గుండె చప్పుడు పదింతలవుతుంది. ప్రస్తుతం ఇండియాలో సాగుతున్న హిందుత్వ వాదం, దాని పట్ల పెరుగుతున్న మోజును కార్తికేయ 2 బాగా ఎన్కేష్ చేసుకుంది. ఇది కాకపోయినా కూడా, కొన్ని పౌరాణిక పాత్రల పట్ల ప్రేక్షకలోకంలో మోజు, వ్యామోహం ఎన్నటికీ తరగదు. అటువంటిదే హనుమంతుడి పాత్ర. ఆ పాత్ర మీద ప్రశాంత్ వర్మ బాగా తన కళాత్మక శ్రమని ఇన్వెస్ట్ చేశాడు. దుష్టశక్తి, దైవశక్తి పోరాడే క్రమంలో ఎప్పటికీ దైవశక్తే విజయం సాధిస్తుంది. అదే ప్రేక్షకులు ఎంజాయ్ చేసేది.

ఇదే ఫార్ములాతోనే దర్శకుడు తేజా జయం సినిమాని నితిన్ తొలి సినిమాగా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అందులో క్లైమాక్సులో విలన్ గోపీచంద్ కన్నా చాలా బలహీనంగా కనిపించే నితిన్ ఒక్కసారి హనుమంతుడి జెండా పట్టుకోగానే అత్యంత బలవంతుడైపోతాడు. విలన్ని సునాయాసంగా చావగొడతాడు. హనుమాన్ సినిమాలోనైతే తేజా సజ్జ ఏకంగా హనుమంతుడి గదనే పట్టుకున్నాడు. ఇప్పుడున్న సినిమా డైమన్షన్కి ఆ మాత్రం గద అవసరమే. ఎబ్బెట్టుగా ఏం లేదు. పైగా గొప్ప ఎక్సైటింగ్ గా అనిపించింది. దానాదీనా, హనుమాన్ ట్రైలర్ సినిమా విజయాన్ని చాటి చెప్పే ఒక సంచలన కరపత్రంలా అనిపించింది. డెఫినెట్….హిట్ హనుమాన్ అంటున్నారు  ట్రైలర్ చూసిన అభిమానులు. మరి హనుమాన్ ట్రైలర్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.