iDreamPost
android-app
ios-app

Tripti Dimri: ఆ టీమిండియా క్రికెటర్ అంటే చచ్చేంత ఇష్టం అంటున్న ‘యానిమల్’ బ్యూటీ!

  • Author singhj Published - 10:11 AM, Fri - 8 December 23

టీమిండియాలోని ఓ క్రికెటర్ అంటే తనకు చాలా ఇష్టమని ‘యానిమల్’ బ్యూటీ తృప్తీ డిమ్రీ చెప్పారు.

టీమిండియాలోని ఓ క్రికెటర్ అంటే తనకు చాలా ఇష్టమని ‘యానిమల్’ బ్యూటీ తృప్తీ డిమ్రీ చెప్పారు.

  • Author singhj Published - 10:11 AM, Fri - 8 December 23
Tripti Dimri: ఆ టీమిండియా క్రికెటర్ అంటే చచ్చేంత ఇష్టం అంటున్న ‘యానిమల్’ బ్యూటీ!

స్టార్ డైరెక్టర్స్ తీసే సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. బడా మూవీలో ఛాన్స్ వస్తే స్టార్​డమ్ సంపాదించొచ్చని మంచి అవకాశాల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అయితే కొందర్ని హీరోయిన్ ఛాన్స్ వరిస్తే.. మరికొందరికి సెకండ్ హీరోయిన్ అవకాశం వస్తుంది. రెండో హీరోయిన్ రోల్​కు అంతగా ఆస్కారం ఉండదు. మెయిన్ హీరోయిన్​ రోల్​కే ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. అయితే స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టైలే వేరు. ఆయన తన మూవీస్​లో సెకండ్ హీరోయిన్​కు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో దీన్ని చూడొచ్చు. లేటెస్ట్ బ్లాక్​బస్టర్ ‘యానిమల్’లోనూ సెకండ్ హీరోయిన్ రోల్​కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు సందీప్ వంగా. ఇందులో మెయిన్ హీరోయిన్​గా రష్మికా మందన్న నటించగా.. రెండో హీరోయిన్​గా తృప్తీ డిమ్రీ కనిపించారు. అయితే రష్మిక కంటే కూడా తృప్తి క్యారెక్టర్ సినిమాలో బాగా హైలైట్ అయింది.

‘యానిమల్’ ఫిల్మ్ చూసిన ప్రేక్షకులు రష్మిక మందన్న యాక్టింగ్​ను మెచ్చుకుంటున్నారు. అయితే ఆమె కంటే కూడా సెకండ్ హీరోయిన్​గా నటించిన తృప్తీ డిమ్రీని ఆకాశానికెత్తేస్తున్నారు. రష్మికతో పోల్చుకుంటే స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉన్నా తృప్తి సూపర్బ్​గా యాక్ట్ చేశారని అంటున్నారు. ఆమె అందం, అభినయానికి తాము ఫిదా అయిపోయామని ఫ్యాన్స్ అంటున్నారు. సందీప్ రెడ్డి మామూలోడు కాదని.. ఏ క్యారెక్టర్​కు ఎవరు సరిపోతారో సరిగ్గా వారినే సెలక్ట్ చేసుకుంటారని అంటున్నారు. తృప్తి తమకు బాగా నచ్చేసిందని.. ఆమె మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని అంటున్నారు. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ అందాల భామపై కన్నేశారు. ‘యానిమల్’ బ్యూటీని తమ మూవీస్​లో నటింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె కాల్షీట్ల కోసం బడా నిర్మాతలు కూడా పోటీపడుతున్నారట.

ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీలో తృప్తీ డిమ్రీ కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇటు ‘యానిమల్’ బ్యూటీ గానీ అటు మేకర్స్ గానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. హీరోయిన్​ ఆఫర్స్​తో పాటు ఆమెతో స్పెషల్ సాంగ్స్ చేయించేందుకూ కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని టాక్. అందుకోసం భారీ రెమ్యూనరేషన్స్ ఇచ్చేందుకు కూడా వెనుకాడట్లేదని సమాచారం. తృప్తి దూకుడు చూస్తుంటే టాలీవుడ్​లోనే సెటిల్ అయిపోయేలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ‘యానిమల్’ బ్యూటీకి ఓ స్టార్ క్రికెటర్ అంటే చచ్చిపోయేంత అభిమానమట. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ అని తెలిసింది. కోహ్లీ అంటే చాలా ఇష్టమని.. అతడే తన ఫేవరెట్ క్రికెటర్ అని తృప్తీ డిమ్రీ చెప్పారు. దీంతో కింగ్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అమ్మాయిల్లో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్​కు ఇది ఎగ్జాంపుల్ అని అంటున్నారు. మరి.. కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టం అంటూ తృప్తీ డిమ్రీ చెప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: AB De Villiers: షాకింగ్ విషయం బయటపెట్టిన డివిలియర్స్.. ఆ సమస్యతోనే రెండేళ్లు ఆడానంటూ..!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom