ఆ టీమిండియా క్రికెటర్ అంటే నాకు చాలా ఇష్టం: విక్రాంత్ మాస్సే

భారత జట్టులోని ఆ క్రికెటర్ అంటే తనకు చాలా ఇష్టమని ‘12th ఫెయిల్’ ఫేమ్ విక్రాంత్ మాస్సే అన్నాడు. ఆ ప్లేయర్​కు తాను వీరాభిమానినని చెప్పాడు.

భారత జట్టులోని ఆ క్రికెటర్ అంటే తనకు చాలా ఇష్టమని ‘12th ఫెయిల్’ ఫేమ్ విక్రాంత్ మాస్సే అన్నాడు. ఆ ప్లేయర్​కు తాను వీరాభిమానినని చెప్పాడు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు, క్రేజ్ తెచ్చుకోవాలంటే కొంతమందికి చాలా టైమ్ పడుతుంది. ఎన్నో సినిమాలు చేస్తే గానీ ప్రేక్షకుల్లో సరైన గుర్తింపు దక్కించుకోలేరు. కానీ కొందరు మాత్రం ఒక్క చిత్రంతోనే ఓవర్​నైట్ స్టార్స్ అయిపోతారు. అలా ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే. ‘మీర్జాపూర్’ లాంటి సూపర్​హిట్​ వెబ్​ సిరీస్​తో లైమ్ టైట్​లోకి వచ్చిన ఈ యాక్టర్.. ఆ తర్వాత కాలంలో ‘హసీన్ దిల్​రుబా’, ‘చపాక్’, ‘ఫోరెన్సిక్’, ‘గ్యాస్ లైట్’ లాంటి చిత్రాలతో నటుడిగా సత్తా చాటాడు. కానీ గతేడాది వచ్చిన ‘12th ఫెయిల్’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించాడు. మనోజ్ కుమార్ శర్మ అనే యువకుడిగా అతడు నటించిన తీరు, ఎక్స్​ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. అలా ఫుల్ ఫేమస్ అయిన విక్రాంత్ మాస్సే క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. ఓ భారత క్రికెటర్ ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోతానన్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని విక్రాంత్ మాస్సే అన్నాడు. హిట్​మ్యాన్​కు తాను స్ట్రాంగ్ సపోర్టర్​నని చెప్పాడు. ఇద్దరిదీ ముంబై నేపథ్యం కావడంతో అతడికి కచ్చితంగా మద్దతు ఇస్తానని తెలిపాడు. ‘నేను రోహిత్​కు వీరాభిమానిని. అతడిది ముంబైలోని డోంబివ్లీ ప్రాంతం. ఐపీఎల్​లో అతడు ముంబై ఇండియన్స్​కు ఆడతాడు కాబట్టి నా సపోర్ట్ అతడికే. ఈ విషయంలో నా ఫ్రెండ్స్ అందరూ నాతో గొడవపడతారు. టీమిండియాలో కేఎల్ రాహుల్ అంటే కూడా నాకు ఇష్టం. అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్. అతడు భవిష్యత్తులో మరింత గొప్ప బ్యాటర్​గా పేరు తెచ్చుకుంటాడని నమ్ముతున్నా’ అని విక్రాంత్ మాస్సే చెప్పుకొచ్చాడు. భారత స్టార్ల గురించి ‘12th ఫెయిల్’ నటుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అవును.. కేఎల్ తప్పకుండా ఫ్యూచర్​లో మరింత గ్రేట్ ప్లేయర్​గా పేరు తెచ్చుకుంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ‘12th ఫెయిల్’లో అద్భుతమైన నటనకు గానూ ప్రతిష్టాత్మక ఫిల్మ్​ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు విక్రాంత్ మాస్సే. ఫిల్మ్​ఫేర్ క్రిటిక్ బెస్ట్ యాక్టర్​గా నిలిచాడతను. ‘12th ఫెయిల్’ సినిమా కథాంశం గురించి తెలిసిందే. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్​ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఆయనకు కూడా ఫిల్మ్​ ఫేర్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ నిలవగా.. ‘12th ఫెయిల్’ సినిమాకు ఓవరాల్​గా 5 పురస్కారాలు దక్కాయి. మనిషి ఎదుగుదలకు, వికాసానికి చదువు ఎంతో ముఖ్యమని చెబుతూనే.. లైఫ్​లో అనుకున్న లక్ష్యం చేరే క్రమంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది ‘12th ఫెయిల్’. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి హృదయాలకు ఈ మూవీ హత్తుకుంది. థియేటర్లలో కంటే ఓటీటీలోకి వచ్చాక దీనికి మరింత ఆదరణ దక్కింది. మరి.. రోహిత్ తన ఫేవరెట్ అంటూ విక్రాంత్ మాస్సే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గాయంతో మరో ఆటగాడు దూరం! జట్టుకు భారీ ఎదురుదెబ్బ

Show comments