iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ‘టార్జాన్’ హీరో క‌న్నుమూత‌..!

  • Published Oct 24, 2024 | 1:42 PM Updated Updated Oct 24, 2024 | 1:42 PM

Tarzan Hero Ron Ely: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

Tarzan Hero Ron Ely: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

ఇండస్ట్రీలో విషాదం.. ‘టార్జాన్’  హీరో క‌న్నుమూత‌..!

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నెల వ్యవధిలోనే పలువురు సెలబ్రెటీలు కన్నుమూశారు. నటీనటులు, దర్శక-నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని అభిమానించే అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. చాలా వరకు అనారోగ్యం, వయోభారం,గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు కారణంగా చనిపోతున్నారు.ఆదిపురుష్ నటి ఆశా వర్మ, నటుడు నిర్మల్ బెన్ని, బిజిలి రమేష్, వికాస్ సేథీ, ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు,నటి సీఐడీ శకుంతల కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ హీరో రాన్ ఎలీ(86) కన్నుమూశారు. 1966 నుంచి 1968 వరకు టార్జన్ షో ఎన్‌బీసీ టెలివిజన్ నెట్ వర్క్‌లో ప్రసారం అయ్యింది. అప్పట్లో ఈ షో ఎంతో పాపులర్ కావడంతో టార్జన్ హీరోగా రాన్ ఎలీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాన్ ఎలీ కన్నుమూశారు. ఈ విషయం స్వయంగా ఆయన కూతురు కిర్ స్టెన్ ఎలీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. నా తండ్రి నాకు ఒక రోల్ మోడల్, ఆయన నాకు ఎప్పటికీ హీరో. నటుడు, రచయిత, కోచ్ గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్టపడి తన చుట్టూ బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణం కుటుంబానికి, ఇండస్ట్రీకి తీరని లోటు’ అంటూ పోస్ట్ చేసింది.

2001 లో రాన్ ఎలీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి రచయితగా మారారు. ఈ క్రమంలోనే రెండు మిస్టరీ నవలలు రాశారు. రాన్ ఎలీ తన కెరీర్ లో 100 కు పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2014 చిత్రం ఎక్స్‌పెక్టింగ్ అమిష్‌లో కొంతకాలం తిరిగి నటించాడు. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. 1938 లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించారు. 1959 లో తన స్కూల్ మెట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు సంతానం. సెప్టెంబర్ 29న కాలిఫోర్నియాలో శాంటా బార్బరాలోని తన ఇంట్లో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కూతురు కిర్ స్టెన్ ఎలీ ఆలస్యంగా ప్రపంచానికి తెలిపారు. కెరీర్ పరంగా చూస్తే.. రాన్ ఎలీ 1966-1968 NBC సిరీస్ ‘టార్జాన్‌’లో హీరో టార్జన్ పాత్ర పోషించాడు. డాక్ సావేజ్: ది మ్యాన్ ఆఫ్ బ్రాంజ్ (1975) చిత్రం హీరోగా ఆయనకు మరింత పేరు తీసుకువచ్చింది.టార్జన్ సీరీస్ నడుస్తున్న సమయంలో రాన్ ఎలీ ఎన్నోసార్లు గాయాలపాలయ్యారు. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా నటించడం వల్ల ఆయనకు టార్జన్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రాన్ ఎలీ మరణ వార్త విని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రముఖులతో పాటు నెటిజ‌న్లు కూడా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.