తెలుగు చిత్రపరిశ్రమలో రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్స్ లో తనికెళ్ళ భరణి ఒకరు. రచయితగా కెరీర్ ఆరంభించి.. నటుడిగా వందల సినిమాలలో వినూత్నమైన పాత్రలతో మెప్పించిన ఆయన.. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించేశారు. అడపాదడప సినిమాలలో కనిపిస్తున్నప్పటికి.. రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన చర్చలలో, కార్యక్రమాలలో కనిపిస్తుంటారు. ఈ క్రమంలో తనికెళ్ళ భరణి.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘బలగం’ మూవీపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి, కమర్షియల్ గాను సక్సెస్ అయింది.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన బలగం మూవీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సైతం అందుకుంది. ఏ సినిమాకైనా కథాకథనాలు బలంగా ఉంటే.. జనాలు ఆదరిస్తారని బలగం మూవీ ప్రూవ్ చేసింది. ఈ సినిమా కథ పరంగా.. తెలంగాణ కల్చర్ ని ప్రెజెంట్ చేస్తూ రూపొందింది. అయితే.. బలగం మూవీపై తాజాగా తనికెళ్ళ భరణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో తనకు నచ్చిన సినిమా బలగం. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ నటులతో తెరకెక్కింది. ఇక సినిమాలో.. నల్లి బొక్క గురించి యుద్ధం చేయడమనేది చాలా సిల్లీ పాయింట్.
అదే పాయింట్ కి ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో చూశాం. తెల్లారితే పళ్లెంలో నల్లి బొక్క ఉండాల్సిందే. వేరే ప్రాంతాలలో ఇది పెద్ద ఇష్యూ కాదు. తెలంగాణలో ఫుడ్ అనేది గౌరవానికి సంకేతం. కావాలంటే నాలుగు మేకలు ఎక్కువ కోస్తా అంటాడు. కానీ.. ఆంధ్రాలో నన్ను కాదని వేరే వాడికి ఎలా పెడతావ్ అనేది అక్కడి గౌరవంగా భావిస్తుంటారు. ఉదాహరణకు.. ఆంధ్రాలో కోడి పందేలు జరుగుతాయి. అందులో కోడి చనిపోయిందంటే దాని ఓనర్ చనిపోయినట్లే. అక్కడ మనిషిని కోడి రిప్రజెంట్ చేస్తుంది. పందెంలో ఓడిపోతే కొన్నాళ్ళు బయటికి రాడు. అలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆహారం, సంప్రదాయం, యాస భాషల్లో వ్యత్యాసం ఉంటుంది. ఎవరైనా ఆన్నింటిని గౌరవించాల్సిందే’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.