iDreamPost
android-app
ios-app

కొత్త టికెట్ రేట్స్ పై గవర్నమెంట్ కి థియేటర్ ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్!

  • Author ajaykrishna Published - 07:46 PM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 07:46 PM, Tue - 4 July 23
కొత్త టికెట్ రేట్స్ పై గవర్నమెంట్ కి థియేటర్ ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్!

సినీ ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ ఇష్యూ కూడా అప్పుడప్పుడు సంచలనంగా మారుతుంటుంది. ఒక్కో రాష్ట్రంలో.. ఆయా ప్రభ్యుత్వాలు, ఇండస్ట్రీకి మధ్య ఉన్న పరస్పర అంగీకారాల మధ్య టికెట్ రేట్స్ కి అనుమతులు లభిస్తుంటాయి. తాజాగా థియేటర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కొత్త రేట్స్ ని ఫిక్స్ చేస్తూ.. గవర్నమెంట్ కి వినతి అందించిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. ఏసీ మల్టీప్లెక్స్ లలో మినిమమ్ రూ. 250, నాన్ ఏసీ మల్టీప్లెక్స్ లలో రూ. 150 గా.. అలాగే ఐమాక్స్ లలో ఏకంగా టికెట్ ధరలు రూ. 450 గా నిర్ణయించాలని సదరు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వినతి పత్రంలో పేర్కొంది. ఇప్పుడా వినతి పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ థియేటర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించినది అనేగా మీ డౌట్.. మన తెలుగు రాష్ట్రాలలో అయితే కాదు. ఇది తమిళనాడులో జరిగింది. అవును.. తమిళనాడు థియేటర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్.. తమ ప్రభుత్వానికి కొత్తగా తాము రిక్వెస్ట్ చేసిన టికెట్ రేట్స్ కి అనుమతి కోరుతూ వినతి పత్రం అందించింది. అందులో ఏయే థియేటర్స్ లో టికెట్ రేట్స్ ఎలా ఉండాలో వారు క్లియర్ గా పేర్కొన్నారు. మల్టీప్లెక్స్(ఏసీ)లో రూ. 250, నాన్ ఏసీలో రూ. 150, కార్పొరేషన్/టౌన్ ఏరియాల మల్టీప్లెక్స్ లో రూ.200, ఐమాక్స్ లో రూ. 450, ఈపిఐక్యూ లో రూ. 400.. అదేవిధంగా రీక్లైనర్ సీట్స్ లో రూ. 350 ఉండాలని వారు కోరారు.