P Krishna
Comedian Yogi Babu: కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యోగి బాబు. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
Comedian Yogi Babu: కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యోగి బాబు. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
P Krishna
సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ ఇస్తే మా టాలెంట్ ఏంటో చూపిస్తాం అంటూ ప్రతిరోజూ ఎంతో మంది యువత స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. అదృష్టం బాగుండి ఛాన్స్ వచ్చినా.. నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇండస్ట్రీలోకి డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తన కామెడీ టైమింగ్‌తో ధియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యోగి బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ కమెడియన్ గా తన సత్తా చాటుతున్నాడు. తన జీవితంలో పడిన కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల స్టార్ కమెడియన్ యోగి బాబు హీరోగా తెరకెక్కిన బోడ్ మూవీకి మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా కమెడియన్ యోగి బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నా జీవితంలో ఎదురైన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు నేను ఇంట్లో ఏ పని లేక ఖాళీగా తిరుగతున్న సమయంలో బంధువులు తిట్టేవారు, అవహేళన చేసేవారు. సినిమాల్లో ఛాన్సు కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పినపుడు నీ ముఖానికా అంటూ అందరూ నవ్వుకున్నారు.. ఆ సమయంలో బంధువులు, స్నేహితులు ఎంతగా నిరుత్సాహ పరిచారో మాటల్లో వర్ణించలేం’ చెప్పారు.
సినిమాల్లో ఛాన్స్ రాక ముందు బిల్డింగ్ సెంటరింగ్ చేశాను, ఏడాది పాటు వాచ్ మెన్ గా నైట్ డ్యూటీ చేశాను, హ్యూందాయ్ కంపెనీ, సిలిండర్ కంపెనీ ఇలా పలు ఉద్యోగాలు చేస్తూ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించాను. సినిమాల్లో ఛాన్స్ వచ్చాక డ్యాన్సర్ గా చేశాను, ఆర్ట్ డైరెక్టర్ తో సెట్స్ వేయడం ఇలా ఎన్నో రకాల పనులు చేశాను. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఎవరైనా రాణిస్తారు. మనం ఎవరికైనా సాయం చేయకున్నా పరవాలేదు.. నిరుత్సాహ పరిచేలా మాట్లాడటం, అవమానించడం చేయొద్దు. ఎవరికైనా ఒక టైమ్ అనేది తప్పకుండా వస్తుంది.. దాన్ని సద్వినియోగం చేసుకొని లైఫ్ లో ఏదైనా సాధించాలని అని అన్నారు.