iDreamPost
android-app
ios-app

ఆధ్యాత్మిక సేవలో మిల్కీ బ్యూటీ తమన్నా.. ఫోటోలు వైరల్

  • Published Jan 25, 2024 | 2:23 PM Updated Updated Jan 25, 2024 | 2:23 PM

టాలీవుడ్ లోకి హ్యాపీ డేస్ తో ఎంట్రీ ఇచ్చిన తమన్నా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

టాలీవుడ్ లోకి హ్యాపీ డేస్ తో ఎంట్రీ ఇచ్చిన తమన్నా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

  • Published Jan 25, 2024 | 2:23 PMUpdated Jan 25, 2024 | 2:23 PM
ఆధ్యాత్మిక సేవలో మిల్కీ బ్యూటీ తమన్నా.. ఫోటోలు వైరల్

తెలుగు ఇండస్ట్రీలోకి తమిళ, కన్నడ, మలమాళ భాషలకు సంబంధించిన హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. అలాంటి వారిలో తమిళ బ్యూటీ తమన్నా ‘హ్యాపీడేస్ ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు దక్కించుకుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా ఆ అమ్మడు కుర్రాళ్ల మనసు దోచింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదిహేడేళ్లు అవుతున్నా.. ఏ మాత్రం గ్లామర్ తగ్గలేదు. అంతేకాదు ప్రస్తుతం వెండితెరపై కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది తమన్నా. ఇటీవల మెగాస్టార్ నటించిన భోళా శంకర్ చిత్రంలో కనిపించింది. ఇటీవల తమన్నా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది. తమన్నా ఓ ప్రముఖ దేవాలయంలో పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు తమ గ్లామర్ షో తో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారికి నటనలో పెద్దగా స్కోప్ లేదని విమర్శలు వస్తున్నాయి. కానీ అందం, నటన, డ్యాన్స్ అన్నింటిలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్ గానే కాదు.. ఐటమ్ సాంగ్స్ లో కూడా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న తమన్నా ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబుతన్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తమన్నా ఆధ్యాత్మకత సేవలో తరిస్తుంది. ఇప్పటికే పలు దేవాలయాలు దర్శించుకుంది. తాజాగా తన కుటుంబ సభ్యులతో గువాహటీలోని ప్రముఖ కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకుంది.

tamannah bhatia

హీరోయిన్ గా ఎంత టాప్ పొజీషన్ లో ఉన్నా.. తమన్నాకు దైవం పట్ట అపారమైన నమ్మకం, భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు దేవాలయాలను సందర్శిస్తూ.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది. పసుపు రంగు చుడీదార్, మెడలో హారం, నుదిపై కుంకు బొట్టు తో ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. ఈ సందర్భంగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నా ప్రియమైన వారితో పవిత్ర క్షేత్రంలో కొన్ని క్షణాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అరుణ్ గోపీ దర్శకత్వంలో వస్తున్న ‘బాంద్రా’ మూవీలో నటిస్తుంది. యాక్షన్ , డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మాలీవుడ్ లోకి తొలిసారిగా ఎంట్రీ ఇస్తుంది. ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet