iDreamPost
android-app
ios-app

మునుపెన్నడూ ఇలా కనిపించని తమన్నా.. ఓదెల 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

  • Published Mar 08, 2024 | 1:59 PM Updated Updated Mar 08, 2024 | 1:59 PM

కరోనా సమయంలో ఓటీటీలో అలరించిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్. ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

కరోనా సమయంలో ఓటీటీలో అలరించిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్. ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

  • Published Mar 08, 2024 | 1:59 PMUpdated Mar 08, 2024 | 1:59 PM
మునుపెన్నడూ ఇలా కనిపించని తమన్నా.. ఓదెల 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఓటీటీలో రిలీజై.. సెన్సేషనల్ సృష్టించిన థ్రిల్లర్, యాక్షన్ చిత్రం ఓదెల రైల్వే స్టేషన్. 2022లో విడుదలైన ఈ చిత్రం.. మంచి వ్యూస్ రాబట్టుకుంది. వశిష్ట, హెబ్బా పటేల్, సాయి రోనక్, భూపాల్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ ఈ సినిమాను నిర్మించారు. వర్సటైల్ డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకు కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం.. ఆహా ఓటీటీలో రెండేళ్ల క్రితం రిలీజై ట్రెమండస్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా యాక్ట్ చేస్తోంది.

గతంలో ఓదెల 2 తెరకెక్కబోతుంది అంటూ ఎనౌన్స్ చేసిన సంపత్ నంది.. ఇందులో తమన్నా కీలక రోల్ చేస్తుందని, మునుపెన్నడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదంటూ వెల్లడించాడు. తాజాగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మహా శివరాత్రి పర్వదినాన్నిపురస్కరించుకుని తమన్నా లుక్ రివీల్ చేశారు. ఇప్పుటి వరకు హాట్ అండ్ గ్లామరస్ పాత్రల్లో కనిపించిన మిల్కీ బ్యూటీ.. ఇందులో ఆధ్యాత్మికమైన పాత్రలో కనిపిస్తోంది. ఓదెల 2లో ఆమె శివ శక్తి అనే క్యారెక్టర్ చేస్తుంది. గంగానదీ ఒడ్డున ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో దండం పట్టుకుని, కాషాయ వస్త్రాలు, నుదిటిన విభూది ధరించిన పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిబట్టి చూస్తే.. ఇదో మైథలాజికల్ మూవీగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి కూడా కథ, మాటలు సంపత్ నంది అందిస్తున్నాడు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పై డి మధు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తొలి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా, ఇది థియేటర్లలోనే విడుదల చేయనుంది చిత్ర యూనిట్. కాంతార, విరూపాక్ష, మంగళవారం వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన అంజనీష్.. ఈ మూవీకి కూడా బాణీలు సమకూర్చునున్నారు. ఈ చిత్రానికి కూడా మెగా ఫోన్ పట్టనున్నాడు దర్శకుడు అశోక్ తేజ. కాగా, సంపత్ నంది దర్శకుడిగా తమన్నా గతంలో మూడు చిత్రాల్లో నటించిన సంగతి విదితమే. రచ్చ, బెంగాల్ టైగర్. సీటీమార్ వంటి చిత్రాలు వీరిద్దరీ కాంబోలో వచ్చాయి. ఇప్పుడు అతడి ప్రొడక్షన్ హౌస్ పై మరో చిత్రంలో నటిస్తోంది తమన్నా.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom