iDreamPost
android-app
ios-app

కిల్లింగ్ డ్యాన్స్ తో తమన్నా సందడి! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Published - 08:37 PM, Thu - 27 July 23
  • Author Soma Sekhar Published - 08:37 PM, Thu - 27 July 23
కిల్లింగ్ డ్యాన్స్ తో తమన్నా సందడి! వైరలవుతున్న వీడియో

తమన్నా.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ లో మెగాస్టార్ తో భోళా శంకర్ చేస్తుండగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘జైలర్’ సినిమాలో తలైవా సరసన ఆడిపాడింది. కాగా బోల్డ్ స్టోరీస్ 2, విజయ్ వర్మతో డేటింగ్ కారణంగా కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ నటించిన రెండు సినిమాలు మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటోంది బ్యూటీ. భోళా శంకర్ ప్రమోషన్స్ ఇంకా మెుదలు పెట్టలేదు. కానీ సూపర్ స్టార్ జైలర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. దాంతో బాలీవుడ్ లో తెగ సందడి చేస్తోంది మిల్కీ బ్యూటీ.

‘జైలర్’ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. సుమారు రూ .200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిపోయాయి.

ఇక ఈ సినిమాలో తమన్నా వేసిన డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ‘నువ్ కావాలయ్య నువ్ కావాలయ్య రా.. రా’ అనే పాటకు కిల్లింగ్ స్టెప్పులు వేసింది మిల్కీ బ్యూటీ. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తనదైన స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది మిల్కీ బ్యూటీ. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో.. మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా బాలీవుడ్ లో సందడి చేస్తోంది అందాల భామ. తాజాగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో తమ్ము బేబీ మరోసారి తన స్టెప్పులతో అభిమానులను అలరించింది. నువ్ కావాలయ్య పాటకు స్టేజిపై తనదైన డ్యాన్స్ తో దుమ్మురేపింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

ఇదికూడా చదవండి: OTTలో మూవీ జాతర.. ఈ వారం స్ట్రీమింగ్ కు సిద్దమైన 23 సినిమాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి