iDreamPost
android-app
ios-app

Tamanna: నిర్మాతలను భయపెడుతున్న తమన్నా డిమాండ్‌!

  • Published Dec 09, 2023 | 5:23 PM Updated Updated Dec 09, 2023 | 5:23 PM

మిల్కీ బ్యూటి తమన్నాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. ఆమె వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. లస్ట్‌స్టోరీస్‌ 2 నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె డిమాండ్‌ నిర్మాతలకు ఇబ్బందిగా మారిందట.

మిల్కీ బ్యూటి తమన్నాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. ఆమె వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. లస్ట్‌స్టోరీస్‌ 2 నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె డిమాండ్‌ నిర్మాతలకు ఇబ్బందిగా మారిందట.

  • Published Dec 09, 2023 | 5:23 PMUpdated Dec 09, 2023 | 5:23 PM
Tamanna: నిర్మాతలను భయపెడుతున్న తమన్నా డిమాండ్‌!

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల్లో కాస్త ఆఫర్లు తగ్గడంతో సిరీస్ లు చేస్తోంది. మరో వైపు ఐటం సాంగ్స్ లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. నటిగా తమన్నా కి ఆఫర్లు తక్కువ ఉన్నా కూడా పారితోషికం విషయంలో తగ్గడం లేదట. ఆమె డిమాండ్‌ చేస్తున్న పారితోషికం చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా ఉందట. తమన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘శ్రీ’ సినిమాతో 2005 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తమన్నాకి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయింది.

దాంతో వెంటనే తమన్నాకి ఆఫర్లు రాలేదు. కానీ 2007 సంవత్సరంలో వచ్చిన చిన్న ఆఫర్‌ అయిన హ్యాపీడేస్‌ చిత్రం ఆమెకి పెద్ద విజయాన్ని తెచ్చి పెట్టి స్టార్‌ హీరోయిన్‌ గా నిలబడే అవకాశాలు తెచ్చి పెట్టింది. మిల్కీ బ్యూటీ గా పేరు దక్కించుకున్న తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇంత కాలం కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా హిందీ, కన్నడం మరియు తమిళ ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచిన మిల్కీ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో కాస్త డల్ అయింది. స్టార్‌ హీరోలు ఈమెతో సినిమాలకు ఆసక్తి చూపడం లేదు అనే టాక్‌ వినిపిస్తోంది.

హీరోయిన్‌గా ఆఫర్లు రాకున్నా కూడా ఐటం సాంగ్స్‌ ని కూడా చేస్తూ బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు వెబ్‌ సిరీస్‌లలో కూడా నటించి మెప్పిస్తోంది. చివరకు మ్యూజిక్‌ ఆల్బం తో కూడా ఈ మధ్య కాలంలో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే ఏ ఒక్క ఆఫర్‌ ని వదలకుండా భారీ పారితోషికం తీసుకుంటూ తన ఇమేజ్ ని సద్వినియోగం చేసుకుంటున్న తమన్నా పారితోషికం ఇప్పటికి కూడా చిన్న నిర్మాతలకు అందనంత ఉంది అంటూ సినీ వర్గాల వారిలో మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

సినిమాలో చిన్న పాత్ర అయినా, హీరోయిన్‌ రోల్‌ అయినా, ఐటం సాంగ్ అయినా కోటి కి మించే కానీ తగ్గితే డేట్లు ఇచ్చేది లేదు అంటూ తమన్నా నిర్మాతలకు కండీషన్స్ పెడుతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా పారితోషికం విషయంలో తగ్గకున్నా కూడా ఆమె కి రెగ్యులర్ గా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ముందు ముందు కూడా ఇంత భారీగా డిమాండ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆమెకు చిన్నా చితకా ఆఫర్లు కూడా రాకుండా మొత్తానికి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. మరి తమన్నా ఇప్పటికి అయినా చిన్న నిర్మాతలకు అందే ఎత్తులో నిల్చుంటుందా మరి కొంత కాలం కోటిలోనే ఉంటుందా అనేది చూడాలి. ఆఫర్లు లేని ఈ సమయంలో కూడా తమన్నా కోటి డిమాండ్ చేయడం పై మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ