iDreamPost
android-app
ios-app

ఓటిటిలోకి సిద్ధార్థ్ ‘టక్కర్’ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • Author ajaykrishna Published - 07:29 PM, Wed - 5 July 23
  • Author ajaykrishna Published - 07:29 PM, Wed - 5 July 23
ఓటిటిలోకి సిద్ధార్థ్ ‘టక్కర్’ మూవీ! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

హీరో సిద్ధార్థ్.. కెరీర్ లో లవర్ బాయ్ క్యారెక్టర్స్ తో ఎంత ఫేమ్ సంపాదించుకున్నాడో.. ఆ తర్వాత స్టోరీ సెలక్షన్ బాలేక వరుస ప్లాప్స్ లో మునిగిపోయాడు. తెలుగులో అయితే చాలా కాలం పాటు కనిపించకుండా పోయాడు. కానీ. అతని సినిమాలు తెలుగులోకి డబ్ అయి రిలీజ్ అవుతూ వచ్చాయి. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధార్థ్.. మహాసముద్రం మూవీతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ కోలీవుడ్ కి వెళ్లి తన సినిమాలు డబ్ రూపంలో రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గా సిద్ధార్థ్ హీరోగా నటించిన మూవీ టక్కర్. మొదటిసారి ఓ యూత్ ఫుల్ బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేశాడు.

మజిలీ ఫేమ్ దివ్యంశా కౌశిక్.. టక్కర్ లో సిద్దార్థ్ సరసన యాక్ట్ చేసింది. కార్తీక్ జి మూవీ రూపొందించాడు. అయితే.. యాక్షన్ డ్రామాగా తెరపైకి వచ్చిన ఈ మూవీకి థియేటర్స్ లో నిరాశే మిగిలిందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అసలు పట్టించుకోలేదు. రిలీజ్ రోజే రొటీన్ స్టోరీ అని తెలిసే సరికి.. ఫ్యాన్స్ కూడా ఇంటరెస్ట్ చూపకపోవడం గమనార్హం. దీంతో సిద్దార్థ్ ఖాతాలో టక్కర్ కూడా ప్లాప్ గా నిలిచింది. థియేట్రికల్ గా డిజప్పాయింట్ చేసిన టక్కర్ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులు సొంతం చేసుకుంది. ఇక జులై 7 నుండి తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. మరి ఓటిటిలో టక్కర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet