iDreamPost
android-app
ios-app

తారే జమీన్ పర్ పిల్లాడు.. హీరో అయ్యాడని తెలుసా..? ఇప్పుడెలా ఉన్నాడంటే..?

Taare Zameen Par Child Artist.. అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ తారే జమీన్ పర్. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు జాతీయ అవార్డులు కూడా దక్కాయి. ఇందులో నటించిన పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

Taare Zameen Par Child Artist.. అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ తారే జమీన్ పర్. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు జాతీయ అవార్డులు కూడా దక్కాయి. ఇందులో నటించిన పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

తారే జమీన్ పర్ పిల్లాడు.. హీరో అయ్యాడని తెలుసా..? ఇప్పుడెలా ఉన్నాడంటే..?

ప్రతి విద్యార్థిలో ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకరు బాగా చదివితే.. మరొకరు ఆటలో రాణిస్తున్నారు. మరొకరికి సంగీతం అంటే ఇష్టం.కొంత మంది బడిలో కన్నా గ్రౌండ్‌లో గడిపేందుకు మక్కువ చూపుతుంటారు. కానీ పిల్లల ఇష్టా ఇష్టాలను, టాలెంట్‌ను గ్రహించని కొంత మంది పేరెంట్స్ .. చదవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. దీని వల్ల అటు చదవలేక, ఇటు తమకు ఇష్టమైన వాటిల్లో రాణించలేక ఎంతో మంది పిల్లలు మానసికంగా హింసకు గురౌతుంటారు. అనంతరం ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. పిల్లలకు చదువు ముఖ్యమే కానీ.. చదువే ముఖ్యం కాదని నిరూపించిన మూవీ తారే జమీన్ పర్. సున్నితమైన అంశాన్ని తనదైన స్టైల్లో తెరకెక్కించాడు నటుడు కమ్ దర్శకుడు అమీర్ ఖాన్.

2007లో వచ్చిన ఈ బాలీవుడ్ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. రూ. 12 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు 100 కోట్లను వసూలు చేసింది. ఎన్నో అవార్డులను దక్కించుకుంది. 55వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ కుటుంబ కథా చిత్రం, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డులు దక్కాయి. ఇక ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా సత్తా చాటింది. దీన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, పీవీఆర్ పిక్చర్స్ పతాకంపై అమీర్ ఖాన్ దర్శక, నిర్మాతగా వ్యవహరించాడు. ఇక కథ విషయానికి వస్తే… 8 ఎనిమిదేళ్ల ఇషాన్ అనే చిన్న పిల్లవాడికి ఉన్నడిజార్డర్ వల్ల చదువు కంటే..ఆర్ట్ వేయడం ఇష్టం. కానీ గ్రహించని పేరెంట్స్.. బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తారు. అక్కడకు వెళ్లాక మరింత మానసిక వేదనతో కుంగిపోయి.. తనకిష్టమైన ఆర్ట్ కూడా వదిలేస్తాడు.

ఆ సమయంలో ఎంట్రీ ఇస్తాడు ఆర్ట్ టీచర్ రామ్ శంకర్. ఇషాన్‌లో సెల్ఫ్ కానిస్పెంట్ పెంచుతాడు. చివరకు స్కూల్ కాంపిటేషన్స్‌లో విన్ అయ్యి అందరితో ప్రశంసలు అందుకుంటాడు. ఇందులో ఇషాన్ పాత్రలో నటించిన పిల్లాడు ఏడ్పించేస్తాడు. ఈ సినిమాకు అతడి నటనే హైలెట్. అన్ని హవా భావాలు పలికించాడు. ఈ మూవీతో తన నటనతో ఆకట్టుకోవడమే కాదు.. ప్రశంసలు అందుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దర్శిల్ సఫారీ. ఈ సినిమా తర్వాత బమ్ బమ్ బోలే, జోకోమాన్, మిడ్ నైట్ చిల్ట్రన్ వంటి సినిమాల్లో నటించాడు. తర్వాత ఎడ్యుకేషన్ నిమిత్తం నటనకు స్వస్థి చెప్పాడు. ఇప్పుడు మళ్లీ పెద్దోడై.. సినిమాల్లో నటిస్తున్నాడు. కుచ్ ఎక్స్ ప్రెస్ అనే గుజరాతీ మూవీతో పాటు హుకుస్, బుకుస్ అనే చిత్రంతో పాటు సీతారే జమీన్ పర్ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఇందులో అమీర్ ఖాన్, జెనీలియా నటిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి