iDreamPost
android-app
ios-app

Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఏంటంటే?

  • Published Jul 29, 2024 | 4:37 PM Updated Updated Jul 29, 2024 | 4:37 PM

గత కొంతకాలంగా మయోసైటిల్ అనే అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటోంది సమంత. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకున్న సామ్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

గత కొంతకాలంగా మయోసైటిల్ అనే అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటోంది సమంత. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకున్న సామ్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 29, 2024 | 4:37 PMUpdated Jul 29, 2024 | 4:37 PM
Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఏంటంటే?

సమంత.. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన అందం, నటనతో అందరిని మాయచేసింది. ఫస్ట్ మూవీతోనే పరిశ్రమను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తూ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. ఓ దశలో సామ్ కు పోటీ రావడానికి మిగతా హీరోయిన్స్ భయపడ్డారనే చెప్పాలి. కానీ, గత కొంతకాలంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సామ్ బాధపడుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఏడాది పాటుగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది సామ్. ఇదిలా ఉండగా.. సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది.

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన స్టార్ హీరోయిన్ సమంత.. అందుకోసం ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటోంది. దాంతో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకున్న సామ్.. ఇకపై అస్సలు టైమ్ వేస్ట్ చేయకుండా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. మూవీసే కాదు.. వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ.. బిజీగా ఉండాలని అనుకుంటోందట. ఈ వార్త తెలిసిన సామ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ ను వెండితెరపై చూసి చాలా రోజులు అవుతుందన్న నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ఇది ఎంతో సంతోషాన్నిచ్చే న్యూస్.

కాగా.. ఇప్పటికే పాన్ ఇండియా మూవీ బంగారం షూటింగ్ దశలో ఉంది. దాంతో పాటుగా మరో రెండు వెబ్ సిరీలు కూడా తెరకెక్కుతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు లైన్ లో ఉన్నాయట. రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్న సామ్.. కథలు వింటూనే ఉందట. రాబోయే కాలంలో సామ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss