iDreamPost
android-app
ios-app

నన్ను దారుణంగా విమర్శించారు! టాలీవుడ్ పై తాప్సీ కౌంటర్!

  • Author ajaykrishna Published - 11:00 AM, Wed - 2 August 23
  • Author ajaykrishna Published - 11:00 AM, Wed - 2 August 23
నన్ను దారుణంగా విమర్శించారు! టాలీవుడ్ పై తాప్సీ కౌంటర్!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎప్పుడు ఎక్కడ స్టార్డమ్ అందుకుంటారో చెప్పలేం. ఒక భాషలో నటించాలని వస్తే.. తిరిగి వేరే ఏ భాషలోనో సినిమాలు హిట్ అవుతుంటాయి. అలా కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీలో కాకుండా వేరే చోట సక్సెస్ అయినవారిని చాలామందిని చూశాం. ఒక్కోసారి ఫేమ్ లో ఉన్నప్పుడు కూడా వేరే ఇండస్ట్రీల వైపు అడుగులు వేస్తుంటారు. అలా వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఎంతోమంది హీరోయిన్స్ కి లైఫ్ ఇచ్చింది. తెలుగు వాళ్ల సంగతి పక్కన పెడితే.. పరాయి భాషలలో నుండి వచ్చిన ముద్దుగుమ్మలను అక్కున చేర్చుకొని మరీ అవకాశాలు కల్పించింది. అలా నార్త్ నుండి వచ్చి ఇక్కడ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ లో తాప్సీ ఒకరు.

ఈ ఢిల్లీ బ్యూటీ మోడలింగ్ ద్వారా సినిమాలలో ప్రవేశించింది. మొదటి సినిమా తెలుగులో.. అదికూడా లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తాప్సీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే.. ఫస్ట్ మూవీ హిట్ అవ్వడంతో మెల్లగా అవకాశాలు వచ్చినా కొద్దీ చేసుకుంటూ పోయింది. కట్ చేస్తే.. అందులో హిట్స్ తో పాటు వరుసగా ప్లాప్స్ కూడా చవిచూసింది. అయితే.. వరుస ప్లాప్స్ పడితే.. హీరోయిన్స్ పై విమర్శలు రావడం మామూలే. అలాగే తాప్సీ కూడా కొన్ని ప్లాప్స్ చేసేసరికి ఆమెను కూడా కామెంట్స్ చేశారు. చాలామంది హీరోయిన్స్ కెరీర్ లో ఎదుగుతున్నప్పుడు ఎదురు దెబ్బలను పట్టించుకోరు. విమర్శలను అసలు లెక్కచేయరు. కానీ.. తాప్సీ టాలీవుడ్ లో జరిగినవన్నీ భద్రంగా దాచుకుందట.

అవన్నీ ఒకానొక సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ బయటపెట్టినట్లు తెలుస్తోంది. తాప్సి మాట్లాడుతూ.. “నేను తెలుగులో సినిమాలు చేసినప్పుడు వాటిలో కొన్ని ప్లాప్ అయ్యాయి. దాంతో నన్ను విమర్శిస్తూ చాలా కామెంట్స్ చేసేవారు. నేను బ్యాడ్ లక్ అని.. సినిమాలు ప్లాప్ అవ్వడానికి నేను కారణం అని.. ఈ విధంగా విమర్శలు గుప్పించారు. కెరీర్ ఆరంభంలో స్క్రిప్ట్ సెలక్షన్ పై అవగాహన లేక తప్పిదాలు జరిగాయి. నేను సినీ బ్యాక్గ్రౌండ్ నుండి రాలేదు. విమర్శలకు గురైనప్పటికీ చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్ని సినిమాలలో నన్ను పాటల వరకే పరిమితం చేశారు. అలా నన్ను అన్నివిధాలా కామెంట్స్ చేస్తే బాధపడ్డాను.” అని చెప్పుకొచ్చింది. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు తగ్గించిన తాప్సీ.. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి తాప్సీ మాటల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio