iDreamPost
android-app
ios-app

Taapsee Pannu: నా భర్త నన్ను దుబాయ్ లో అమ్మేస్తాడని వాళ్లు భయపెట్టారు: స్టార్ హీరోయిన్ కామెంట్స్

  • Published Aug 09, 2024 | 1:18 PM Updated Updated Aug 09, 2024 | 1:18 PM

నా భర్త నన్ను దుబాయ్ లో అమ్మేస్తాడు అంటూ వాళ్లు నన్ను భయపెట్టారు అంటూ చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నా భర్త నన్ను దుబాయ్ లో అమ్మేస్తాడు అంటూ వాళ్లు నన్ను భయపెట్టారు అంటూ చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Aug 09, 2024 | 1:18 PMUpdated Aug 09, 2024 | 1:18 PM
Taapsee Pannu: నా భర్త నన్ను దుబాయ్ లో అమ్మేస్తాడని వాళ్లు భయపెట్టారు: స్టార్ హీరోయిన్ కామెంట్స్

తాప్సీ పన్ను.. టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్థిరపడింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటుంది. ఇక మహిళల సమస్యలపై స్పందిస్తూ.. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు ముక్కుమీదే చెప్పేయడం ఈ సొట్టబుగ్గల సుందరికి అలవాటు. గతంలో ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా తన భర్త మథియాస్ బో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఫస్ట్ డేట్ కు వెళ్లే ముందు తన స్నేహితులు భయపెట్టారు అంటూ చెప్పుకొచ్చింది.

స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ విషయలు వెల్లడించింది. ఈ క్రమంలో తమ ఫస్ట్ డేట్ సమయంలో స్నేహితులు ఎలా తనను భయపెట్టారో వివరించింది. తాప్సీ పన్ను మాట్లాడుతూ..”11 ఏళ్ల క్రితం మెుదటిసారి కలిశాం. అయితే మేము కలిసిన ఏడాది తర్వాత మాలో ప్రేమ చిగురించింది. తక్కువ టైమ్ లోనే మేము రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాం. దాదాపు 9 సంవత్సాలు కలిసి ఉన్నాం. ఈ సమయంలో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకున్నాం. దాంతో ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామన్న నమ్మకం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం.”

thapsee pannu interesting comments

“అయితే మథియాస్ బో డెన్మార్క్ చెందిన వ్యక్తి కావడం, ఇంతక తెల్లగా ఉండి కూడా నన్ను ఎందుకు లవ్ చేస్తున్నాడు అన్న సందేహం వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత అతడి ప్రేమ నాకు తెలిసొచ్చింది. ఇక మా ఫస్ట్ డేట్ రోజులను తలచుకుంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. ఫస్ట్ డేట్ కోసం  దుబాయ్ వెళ్దాం అని చెప్పాడు. నేను ఇదే విషయాన్ని మా ఫ్రెండ్స్ తో చెబితే.. జాగ్రత్త నిన్ను దుబాయ్ లో ఎవరికైనా అమ్మేస్తాడేమో అంటూ భయపెట్టారు” అని తాప్సీ చెప్పుకొచ్చింది.  కాగా.. బ్యాట్మింటన్ ప్లేయర్ అయిన మథియాస్ బో ను ఈ ఏడాది మార్చి 23న వివాహం చేసుకుంది తాప్సీ. ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీనా దిల్ రూబా చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరో మూవీ ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్ట్ 15కు రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet