iDreamPost
android-app
ios-app

90’s టీమ్ నుంచి మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్.. ఈసారి థియేటర్లలో!

  • Published Apr 18, 2024 | 8:01 PM Updated Updated Apr 18, 2024 | 8:01 PM

New Entertainer From #90's Team: తెలుగు ఓటీటీలో ఇటీవల బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 90's మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి మరో కామెడీ ఎంటర్ టైనర్ రాబోతోంది.

New Entertainer From #90's Team: తెలుగు ఓటీటీలో ఇటీవల బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 90's మిడిల్ క్లాస్ బయోపిక్ మేకర్స్ నుంచి మరో కామెడీ ఎంటర్ టైనర్ రాబోతోంది.

  • Published Apr 18, 2024 | 8:01 PMUpdated Apr 18, 2024 | 8:01 PM
90’s టీమ్ నుంచి మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్.. ఈసారి థియేటర్లలో!

ప్రస్తుతం ఓటీటీలో కామెడీ ఎంటర్ టైనర్స్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇటీవల ఓటీటీల్లోకి వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్స్ ఏమైనా ఉన్నాయా అంటే మొదటి చెప్పే పేరు #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ గురించే మాట్లాడతారు. ఇప్పటికీ ఆ సిరీస్ ప్రేక్షకుల మైండ్ లో నుంచి పోలేదు. ఆ సిరీస్ తో డైరెక్టర్ గా పరిచయమైన ఆదిత్య హాసన్ తన మాటలతో కట్టి పడేశాడు. ఆ తర్వాత రీసెంట్ బ్లాక్ బస్టర్ ప్రేమలు సినిమాకి కూడా ఆదిత్య హాసనే డైరాగ్స్ రాశాడు. అలా మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఈసారి మరో సినిమాతో ఈ యంగ్ డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆదిత్య హాసన్ తెలుగు ప్రేక్షకుల నాడి పట్టుకున్నాడు. ఎలా అయితే వాళ్లు ఎంటర్ టైన్ అవుతారో తెలుసుకోగలిగాడు. అందుకే సింపుల్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వించేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ చేసేందేదుకు 90’s టీమ్ సిద్ధమైపోయింది. మొదటి ఓటీటీల్లో సందడి చేసిన ఈ టీమ్ ఇప్పుడు నేరుగా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈసారి కూడా క్లాస్ రూమ్ కామెడితోనే వస్తున్నట్లు చెప్పారు.

ఆదిత్య హాసన్ మరోసారి 90’s టీమ్ తోనే ‘స్వాతి టీచర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో కలర్స్ స్వాతి టీచర్ పాత్రలో కనిపించబోతోంది. అలాగే బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నిత్యశ్రీ, 90స్ ఫేమ్ రాజేంద్ర గౌడ్, సిద్ధార్థ్, హర్ష, పవన్ రమేశ్, నరేందర్ నాగులూరి, సురేశ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీని ఎంఎన్ఓ ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా తెలంగాణలో జరిగే ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా చూపించబోతున్నారు.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ముగ్గురు డల్ స్టూడెంట్స్ ఉంటారు. వారి స్కూల్ జీవితం, చదువులు, వారు చేసే అల్లరి, వాటి మధ్యలో కల్మషంలేని ప్రేమానురాగాలతో ఈ మూవీ వస్తోంది. ఈ సినిమాని 90స్ తరహాలోనే సరదా సరదా సన్నివేశాలు, మంచి కామెడీ, ఎమోషన్స్, ఫ్రెండ్ షిప్ థీమ్ లోనే తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు ఆదిత్య హాసన్ హీరో నితిన్ తో కూడా ఒక మూవీ ఓకే చేసుకున్నాడు. త్వరలోనే అది కూడా పట్టాలెక్కనుంది. మరి.. 90స్ టీమ్ నుంచి వస్తున్న ఈ టీచర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio