iDreamPost
android-app
ios-app

గుంటూరు- హైదరాబాద్ డైలీ ట్రావెల్స్ అంటూ ట్రోల్స్! నిర్మాత రియాక్షన్ ఇది!

Suryadevara Naga Vamsi: మహేశ్ బాబు రీజనల్ హీరోగా వచ్చిన చివరి సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై ఎంతో నెగిటివిటీ నడిచింది. కొందరు కావాలని కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. చాలా మీమ్స్ కూడా వచ్చాయి. వాటికి నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Suryadevara Naga Vamsi: మహేశ్ బాబు రీజనల్ హీరోగా వచ్చిన చివరి సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై ఎంతో నెగిటివిటీ నడిచింది. కొందరు కావాలని కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. చాలా మీమ్స్ కూడా వచ్చాయి. వాటికి నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

గుంటూరు- హైదరాబాద్ డైలీ ట్రావెల్స్ అంటూ ట్రోల్స్! నిర్మాత రియాక్షన్ ఇది!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కథ మొత్తం పూర్తయి పోయిందని స్వయంగా రాజమౌళినే ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే రీజనల్ హీరోగా మహేశ్ బాబు తీసిన ఆఖరి చిత్రం గుంటూరు కారం అని అందరికీ తెలిసిందే. రాజమౌళి ప్రాజెక్ట్ తో మహేశ్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించేందుకు ఆ చిత్రం తీశానని మహేశ్ కూడా చెప్పారు. అయితే ఊహించిన దానికి వ్యతిరేకంగా మొదటి రెండ్రోజులు ఈ మూవీపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. వాటికి మేకర్స్ కౌంటర్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ నంబర్స్ తో సత్తా చాటింది. ఇప్పుడు తాజాగా నిర్మాత ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చారు.

గుంటూరు కారం సినిమా మిడ్ నైట్ షోస్ కూడా వేశారు. అయితే అప్పటి నుంచి పెద్దఎత్తున ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. సినిమా డిజాస్టర్ అంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. అయితే ఒక ప్రెస్ మీట నిర్వహించి మరీ మేకర్స్ ఆడయిన్స్ కు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. వస్తున్న నెగిటివిటీ పట్టించుకోకుండా థియేటర్ కు వెళ్లండి మీకు కచ్చితంగా నచ్చుతుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా కలెక్షన్స్ లో చాలా మార్పు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం డీసెంట్ నంబర్స్ తో దూసుకుపోయింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ మూవీకి ఆడియన్స్ నుంచి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే గుంటూరు కారం మీద చాలానే ట్రోల్స్ జరిగాయి.

ముఖ్యంగా మహేశ్ బాబు సంతకం పెట్టే వంకతో తల్లిని చూడటానికి తరచూ హైదరాబాద్ వెళ్తూ ఉంటాడు. ఆ విషయంపై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. గుంటూరు టూ హైదరాబాద్ డైలీ సర్వీస్ అంటూ విపరీతంగా మీమ్స్ వచ్చాయి. వాటికి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఒక ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ఆయన క్లియర్ గా అలాంటి మీమ్స్ కి ఆన్సర్ చెప్పడం మాత్రమే కాకుండా.. వారికి నేరుగా ప్రశ్నలు కూడా సంధించారు. నాగవంశీ మాట్లాడుతూ.. “మాటిమాటికి గుంటూరు- హైదరాబాద్ వెళ్తున్నాడు అంటున్నారు. అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు 3.30 గంటల సమయం పట్టిద్ది. అది మొత్తం చూపించమంటారా ఏంటి ఇప్పుడు? మాటిమాటికి హైదరాబాద్- గుంటూరు- విజయవాడ వెళ్తున్నాడు అంటూ మీమ్స్ చేస్తున్నారు.

వెటకారం చేయడాని మీమ్స్ చేయడానికి చాలా ఉంటాయి కదా? హైదరాబాద్- గుంటూరు వెళ్తున్నాడు అంటే  రోడ్డు మీద ఎలా వెళ్తున్నాడు? మధ్యలో ఆగి దిగి కాఫీ తాగడం అవన్నీ చూపించమంటారా? మాకు అర్థం కాలేదు. నేను అనేది అక్కడ లాజిక్ అది కాదు. ఒక మదర్- సన్ అప్పటివరకు కలవలేదు. కథ ప్రకారం ఒక సంతకం గురించి తన తల్లిని చూసేందుకు అటూ ఇటూ తిరుగుతున్నాడు. వాళ్ల మదర్ ని చూడటానిక అటూ ఇటూ తిరుగుతున్నాడు. అది గుంటూరు అయితే ఏంటి? హైటెక్ సిటీ అయితే ఏంటి? ఎమోషన్ పట్టుకోకుండా లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు” అంటూ నాగవంశీ కౌంటర్ ఇచ్చారు.