iDreamPost
android-app
ios-app

సూర్య ఖాతాలో మరో రికార్డు.. 10 కాదు.. 38 !

  • Published Nov 20, 2023 | 4:40 PM Updated Updated Nov 20, 2023 | 4:40 PM

హీరో సూర్య కంగువ అనే పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. ఇక, సూర్య ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది...

హీరో సూర్య కంగువ అనే పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. ఇక, సూర్య ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది...

  • Published Nov 20, 2023 | 4:40 PMUpdated Nov 20, 2023 | 4:40 PM
సూర్య ఖాతాలో మరో రికార్డు.. 10 కాదు.. 38 !

హీరో సూర్య ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారన్న సంగతి తెలిసిందే. సినిమాకు సినిమాకు మధ్య పాత్రలో వేరియేషన్స్‌ చూపిస్తూ ఉంటారు. అలా ప్రయోగాలతోటే సూపర్‌ హిట్లను సైతం అందుకున్నారు. ఆకాశమే హద్దురా, జైభీమ్‌ ఇలా భిన్న పాత్రలతో వచ్చిన సినిమాలే. రెండూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. సూర్య ప్రస్తుతం ఓ ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ‘కంగువ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ కంగువ షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది.

ఇక, విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. కంగువ 10 భాషల్లో విడుదల కాబోతోందని మొదట ప్రచారం జరిగింది. అయితే, ఈ చిత్రం 10 భాషల్లో కాదంట.. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల అవ్వనుందట. అది కూడా 3డీ, ఐమ్యాక్స్‌ ఫార్మాట్లలో ప్రేక్షకులను అలరించనుందట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మీడియాకు వెల్లడించారు. ఇదే గనుక  నిజమైతే సూర్య ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు చేరినట్లే.

ఇక, కంగువ సినిమాలో నటరాజ్, జగపతిబాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే, కోవై సరళ, ఆనంద్ రాజ్, రవి రాఘవేంద్ర, కె.ఎస్.రవికుమార్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్‌ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ అంచనాలను పెంచేస్తోంది. కంగువలో సూర్య లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అభిమానులతో పాటు.. సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.

కాగా, సూర్య ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌తో ‘వాడివాసల్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో వాడివాసల్‌ తెరకెక్కుతోంది. ‘జల్లికట్టు’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వాడివాసల్‌ కోసం సూర్య ప్రత్యేకంగా జల్లికట్టు గురించి శిక్షణ తీసుకున్నారు. ఓ ఎద్దును మంచి చేసుకున్నారు. దానితోటే ఎక్కువ సమయం గడిపేవారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా తాజాగా వైరల్‌గా మారింది.

ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య- వెట్రిమారన్‌ల కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావటంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. వాడివాసల్‌ మధ్యలోనే ఆగిపోయిందంటూ గతంలో పుకార్లు వెలువడ్డాయి. అయితే, అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను సినిమాపై క్లారిటీ ఇచ్చారు. వాడివాసల్‌ ఆగిపోలేదని స్పష్టం చేశారు.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom