iDreamPost
android-app
ios-app

అభిమాని పట్ల సూర్య తండ్రి దురుసు ప్రవర్తన! పెద్ద రచ్చే జరిగింది!

తమిళనాడులోనే కాదూ తెలుగు ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్స్ సూర్య, కార్తీ. వీరిద్దరికీ కోలీవుడ్ లోనే కాదూ.. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్య ప్రస్తుతం కంగువా మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి..

తమిళనాడులోనే కాదూ తెలుగు ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్స్ సూర్య, కార్తీ. వీరిద్దరికీ కోలీవుడ్ లోనే కాదూ.. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్య ప్రస్తుతం కంగువా మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి..

అభిమాని పట్ల సూర్య తండ్రి దురుసు ప్రవర్తన! పెద్ద రచ్చే జరిగింది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ హీరోల హవా ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్ మొదలుకుని.. నేటి ధనుష్ వరకు తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా వీరికి విపరీతమైన క్రేజ్ ఉంది. వీళ్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..అక్కడ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించుకోవడమే కాకుండా ఇక్కడ మార్కెట్ ను కూడా లూఠీ చేస్తుంటారు. ఇందుకు అనేక సినిమాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఒకరు.. ఆ ఇంట్లో ఇద్దరు హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. వాళ్లే సూర్య, కార్తీలు. తమిళ ఇండస్ట్రీలో వీరికి ఎంత క్రేజ్ ఉందో.. టాలీవుడ్ నాట కూడా అంతే స్థాయిలో ఉంది.

సూర్య సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇక కార్తీని తమ హీరోగా ఓన్ చేసుకున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే కుటుంబం వీరిది. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోల తండ్రి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కూడా ప్రముఖ నటుడు అన్న సంగతి విదితమే. సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ ఓ అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఓ వ్యక్తి శాలువా కప్పేందుకు వస్తుండగా.. అది లాక్కొని శివకుమార్ విసిరేశారు. దీంతో అతడు ఏం చేయాలో తెలియక.. అతడ్ని ఫాలో అయ్యాడు. శివ కుమార్ ప్రవర్తనపై ఒక్కసారిగా నెటిజన్లు మండిపడ్డారు.

సోషల్ సైనికులు ఆయన దురుసు ప్రవర్తనపై రచ్చ రచ్చ చేశారు. విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. దీంతో ఆయన దిగిరాక తప్పలేదు. ఈ ఘటనపై సూర్య ఫాదర్ వివరణ ఇచ్చారు. ‘ఇతని పేరు కరీమ్. నా తంబి (తమ్ముడు). నాకు మంచి ఫ్రెండ్. అతడు శాలువా తీసుకొస్తుంటే.. నాకెందురా అని చనువు కొద్దీ.. లాక్కొని విసిరేశాను. దీనిపై విమర్శలు వచ్చాయి. అయిన శాలువా విసిరేయడం తప్పు. ఇలా చేసినందుకు ఐయామ్ సారీ అంటూ’ అతడితో కలిసి వివాదంపై వివరణ ఇచ్చారు శివ కుమార్. ఇదిలా ఉంటే కరీమ్ మనవడు రిఫాయ్ కూడా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘వార్తలో చూపిస్తున్న ఆ పెద్దమనిషి మరెవరో కాదు మా తాత. శివకుమార్, ఆయన 50 ఏళ్ల నుండి ఫ్రెండ్స్. శాలువా ఇస్తున్న సమయంలో ఎందుకు రా ఇవన్నీ అని ఫ్రెండ్ అన్న చనువు కొద్దీ.. జోక్‌గా దానిని తీసుకొని విసిరేశారు. ఆ తర్వాత పదా వెళ్దాం అని పిలుచుకొని వెళ్లారు. మెట్లు దిగిన తర్వాత నీ దగ్గరే ఉండనివ్వు అని శాలువాను మరొకరితో ఇప్పించి.. శివకుమార్ మా తాతకు చెప్పారు. మా తాత కరైకుడీలో ఉంటారు. శివకుమార్ అక్కడికి గెస్ట్‌గా వెళ్లారు. శివకుమార్ మా ప్రతీ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వస్తారు, మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు. ఆయన ఇంటికి కూడా మేము చాలాసార్లు వెళ్లాము. నిజమేమిటో తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’ అని కరీమ్ మనవడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)