iDreamPost
android-app
ios-app

Surya: ఆయన సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య!

  • Published Jan 05, 2024 | 4:04 PM Updated Updated Jan 05, 2024 | 4:04 PM

సూర్య తాజాగా ఆయన సమాధి దగ్గరకు వెళ్లారు. నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర్య కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సూర్య తాజాగా ఆయన సమాధి దగ్గరకు వెళ్లారు. నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర్య కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  • Published Jan 05, 2024 | 4:04 PMUpdated Jan 05, 2024 | 4:04 PM
Surya: ఆయన సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య!

ప్రముఖ తమిళ స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ కొద్దిరోజుల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేయగా ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ డిసెంబర్‌ 28వ తేదీన చనిపోయారు. మరుసటి రోజు ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్లతో పాటు లక్షలాది మంది జనం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

హీరో సూర్యకు విజయ్‌కాంత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విజయ్‌కాంత్‌తో కలిసి సూర్య పలు చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచాయి. విజయ్‌కాంత్‌ చనిపోయిన సమయంలో సూర్య షూటింగ్‌ కోసం వేరే దేశం వెళ్లారు. విషయం తెలియగానే ఓ ఎమోషనల్‌ వీడియో విడుదల చేశారు. తాజాగా, సూర్య ఇండియాకు వచ్చారు. వచ్చీరాగానే విజయ్‌కాంత్‌ సమాధి దగ్గరకు వెళ్లారు. నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న సమయంలో సూర్య ఎమోషనల్‌ అయ్యారు.

కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘ మాది సొంత అన్నదమ్ముల బంధం. ఇలా అన్నయ్య వెళ్లిపోవడం బాధాకరం. కెరీర్ బిగినింగ్ లో ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆయనతో 4, 5 సినిమాల్లో నటించాను. పెరియన్న షూటింగ్ సమయంలో మా అన్నయ్యతో దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఆ సమయంలో నేను ఉపవాసం ఉండి నాన్ వెజ్ ముట్టుకోలేదు. ఓ రోజు ఫోన్ చేసి ‘ఈ వయసులో నాన్ వెజ్ తినకపోతే ఎలా?’ తినాలి అని షూటింగ్ టైమ్‌లో తాను తినేప్పుడు ప్లేట్ లోంచి ముక్కలు తీసి తినిపించేవాడు.

అంత ప్రేమగా ఉండేవారు. అన్నయ్యను చివరి చూపు చూసుకోలేకపోవడం బాధగా ఉంది. అన్న ఆశయాల కోసం తప్పకుండా పనిచేస్తాం’’ అని అన్నారు. సూర్య- విజయ్‌కాంత్‌ సమాధి వద్ద ఏడుస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. సూర్య ఏడుస్తున్న వీడియోను చూస్తున్న ఫ్యాన్స్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, విజయ్‌కాంత్‌- సూర్య కాంబినేషన్‌లో  పెరియన్న సంచలన విజయం సాధించింది. సూర్యకు మంచి గుర్తింపు లభించింది. మరి, సూర్య- విజయ్‌కాంత్‌ సమాధి వద్ద ఎమోషనల్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio