iDreamPost
android-app
ios-app

సూర్య ‘కంగువ’ క్రేజీ అప్డేట్స్! మైండ్ బ్లాక్ చేస్తున్న మూవీ డ్యూరేషన్!

  • Author ajaykrishna Published - 01:09 PM, Tue - 25 July 23
  • Author ajaykrishna Published - 01:09 PM, Tue - 25 July 23
సూర్య ‘కంగువ’ క్రేజీ అప్డేట్స్! మైండ్ బ్లాక్ చేస్తున్న మూవీ డ్యూరేషన్!

స్టార్ హీరోల నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ అభిమాన హీరో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవుతున్నాడంటే ఆ క్రేజ్ వేరు. ప్రస్తుతం స్టార్ హీరో సూర్య ఫ్యాన్స్ అలాంటి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సూర్య హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. వినడానికి కొత్తగా ఉన్నప్పటికి.. దానికి అర్థం తెలియకపోయినా జనాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో సూర్య ఓ వయిలెంట్ యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా వచ్చిన కంగువ గ్లింప్స్.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.

ఇప్పటిదాకా సూర్య యోధుడుగా వేరే సినిమాలలో కనిపించాడు. ముఖ్యంగా ‘సెవెన్త్ సెన్స్’ మూవీలో సూర్య బోధిధర్మ క్యారెక్టర్ లో రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. అందులో కూల్ గా కనిపించాడు గానీ.. ఈసారి కంగువలో పూర్తిగా పరాక్రమ యోధుడుగా బిగ్ స్క్రీన్ పై రచ్చ లేపనున్నాడు. ఆల్రెడీ గ్లింప్స్ చూస్తేనే.. విజువల్స్ కి తోడు సూర్య క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమాని నిర్మిస్తున్న ‘స్టూడియో గ్రీన్’ ప్రొడక్షన్స్ సీఈఓ ధనుంజయన్ తాజాగా క్రేజీ అప్డేట్స్ రివీల్ చేసి హైప్ పెంచేశారు. బడ్జెట్ పరంగా సినిమాకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదని చెప్పిన ఆయన.. మూవీ బడ్జెట్ సుమారు రూ. 200 – 250 కోట్లు వరకు కానుందని అన్నారు.

అనంతరం ఇంకా మాట్లాడుతూ.. “కంగువ సినిమా లెన్త్ దాదాపుగా 2 గంటల 45 నిముషాలు ఉంటుంది. అందులో 1 గంట 50 నిముషాల వరకు సీజీ షాట్స్ ఉంటాయి. డైరెక్టర్ శివ చాలా రెస్పెక్ట్ ఫుల్ గా ఉంటాడు. బిహేవియర్ లో చిన్నపిల్లాడని చెప్పాలి. ఇంకా సినిమాకి 40 రోజుల యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం కంగువ 3D వర్క్ కూడా జరుగుతుంది. కేవలం త్రీడి కోసమే రూ. 10 కోట్లు బడ్జెట్ కేటాయించాము. “ఓ వయిలెంట్ రాజు ఆగమనం..” అనేది కంగువ అసలు కాన్సెప్ట్. మీరు ఇదివరకు చూడని రాజును చూడబోతున్నారు. సూర్యని బోధిధర్మ క్యారెక్టర్ లో 20 నిముషాలే చూసారు. కానీ.. ఈసారి ఫుల్ ప్లెడ్జిడ్ గా చూడబోతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ఆగష్టులో స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ టైమ్ లో కంగువ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డైరెక్టర్ శివ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. మరి కంగువ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio