iDreamPost
android-app
ios-app

పుత్రోత్సాహంతో పొంగిపోతున్న సూర్య.. ఎందుకంటే?

  • Published Apr 22, 2024 | 1:41 PM Updated Updated Apr 22, 2024 | 1:41 PM

Suriya Son Dev: తమ పిల్లలు ఏదైనా ఘనత సాధిస్తే ఆ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వర్ణించడానికి మాటలు చాలవు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా తమ పిల్లలు సాధించిన ఘనత సోషల్ మాద్యమాల్లో పంచుకుంటారు.

Suriya Son Dev: తమ పిల్లలు ఏదైనా ఘనత సాధిస్తే ఆ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వర్ణించడానికి మాటలు చాలవు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా తమ పిల్లలు సాధించిన ఘనత సోషల్ మాద్యమాల్లో పంచుకుంటారు.

  • Published Apr 22, 2024 | 1:41 PMUpdated Apr 22, 2024 | 1:41 PM
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న సూర్య.. ఎందుకంటే?

సినీ ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా సూర్యకి మంచి క్రేజ్ ఉంది. రజినీ కాంత్ తర్వాత ఇంత గొప్ప ఫాలోయింగ్ సంపాదించిన హీరో సూర్య ఒక్కడే అంటారు. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా సూర్య, జ్యోతికలను మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి పెళ్లై 18 ఏళ్లు అవుతుంది. ఈ జంట ఎప్పుడూ సోషల్ మీడియాలో  సందడి చేస్తూ ఉంటారు. సూర్య హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. 2008 లో అగరం ఫౌండేషన్‌ను స్థాపించారు.  అనాథ పిల్లలను చదివిస్తున్నారు. తాజాగా హీరో సూర్య తన కొడుకు సాధించన ఘనత చూసి ఉప్పొంగిపోతున్నాడు. ఇంతకీ ఆయన కొడుకు ఏం సాధించాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తమిళ స్టార్ హీరో సూర్య తన కొడుకు దేవ్ సాధించిన ఘనత చూసి తండ్రిగా ఎంతో గర్వ పడుతున్నాడు. దేవ్ ఇప్పటికే జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో అదరగొట్టాడు.. తాజాగా తన కొడుకు బ్లాక్ బెల్డ్ సాధించడంతో ఆ ఘనత చూసి ఉప్పోంగిపోయాడు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే చాలా కాలం పాటు కలిసి ఉన్నారు. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. కూతురు దియా, కుమారుడు దేవ్. సూర్య ఆన్ స్క్రీన్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తన కుటుంబం విషయంలో లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తారని ఫిలిమ్ వర్గాల్లో టాక్.

సూర్య-జ్యోతిక దంపతులు తమ పిల్లల విషయంలో చాలా కేర్‌ఫుల్ గా ఉంటారు. ఎప్పుడైనా తన ఫ్యామిలీతో ఎయిర్ పోర్ట్, ఫంక్షన్స్ లో కనిపించినపుడు పిల్లలను ఫోటోలు తీయొద్దు అంటూ చెబుతుంటాడు సూర్య. అలాంటిది ఇప్పుడు తన కొడుకుకి సంబంధించిన వీడియో షేర్ చేసి ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని అంటున్నారు. సూర్య తనయుడు దేవ్ బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఆ అకాడమీకి సూర్య చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు. అక్కడ తన కొడుకుతో పాటు అందరినీ సత్కరించాడు. ఈ సందర్భంగా సూర్య తన పక్కన కొడుకునే చూసుకొని ఎంతో మురిసిపోయాడు. తాజాగా దీనికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పాన్ ఇండియాగా భారీ బడ్జెట్ తో ‘కంగువ’ మూవీ తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom