iDreamPost
android-app
ios-app

సూర్య “కంగువా” టీజర్ రివ్యూ

  • Published Mar 19, 2024 | 6:11 PM Updated Updated Mar 19, 2024 | 6:11 PM

ఈ సినిమా నుండి తదుపరి అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యలో సినిమా షూటింగ్ లో కాస్త ఆలస్యం అవడం, రిలీజ్ డేట్ గురించి పుకార్లు రావడం వల్ల సినిమా హైప్ కాస్త తగ్గింది.

ఈ సినిమా నుండి తదుపరి అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యలో సినిమా షూటింగ్ లో కాస్త ఆలస్యం అవడం, రిలీజ్ డేట్ గురించి పుకార్లు రావడం వల్ల సినిమా హైప్ కాస్త తగ్గింది.

  • Published Mar 19, 2024 | 6:11 PMUpdated Mar 19, 2024 | 6:11 PM
సూర్య “కంగువా” టీజర్ రివ్యూ

2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. అనౌన్స్ మెంట్ రోజు నుంచే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కాగా ఇది వరజే మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ సినిమా నుండి తదుపరి అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యలో సినిమా షూటింగ్ లో కాస్త ఆలస్యం అవడం, రిలీజ్ డేట్ గురించి పుకార్లు రావడం వల్ల సినిమా హైప్ కాస్త తగ్గింది. ఇక చాలా రోజులకి టీజర్ విడుదల చేస్తున్నాం అంటూ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం తెప్పించారు నిర్మాతలు.

తాజాగా విడుదలైన ‘కంగువా’ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకి సినిమాకి దర్శకుడు సిరుతై శివ. స్వతహాగా మాస్ సినిమాలకి పేరు గాంచిన శివ ఈ సినిమాతో మొట్ట మొదటిసారి ఫాంటసీ జానర్ ను టచ్ చేస్తున్నారు. అయితే ఆయన లేటెస్ట్ “కంగువా” టీజర్ కట్ చేసిన తీరు ఈ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. సముద్రాలు, గిరిజన ప్రాంతాల్లో జరిగే యుద్ధక్షేత్రాల నేపథ్యంలో సూర్య, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మధ్య జరిగే భీకర పోరును ఈ టీజర్లో చూపించారు. ఈ విజువల్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్ళాయనే చెప్పాలి. కాగా సూర్యతో పాటు బాబీ డియోల్ లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో అద్భుతమైన నిర్మాణ విలువలు చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్ వంటి విషయాల పై బాగా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. మొత్తంగా కంగువా సినిమా ఒక విజువల్ వండర్ ను అందిస్తుందని టీజర్ తెలియజేస్తుంది.

రెండేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్ పై కనిపించనున్న సూర్య ఈ సినిమాలో ఆరు విభిన్న గెటప్ లలో కనిపిస్తారని గట్టి టాక్ వినిపిస్తుంది. ‘కంగువా’ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ నటుడు మరోసారి విభిన్న పాత్రలో తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. సూర్యకి తమిళ భాషలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా సినిమాకి గనక మంచి టాక్ వస్తే… సూర్య స్టార్డం తో పాటు ఫాంటసీ కాన్సెప్ట్ తోడై బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş