iDreamPost
android-app
ios-app

సూర్యా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కంగువా సినిమా వాయిదా?

  • Published Aug 25, 2024 | 6:05 PM Updated Updated Aug 25, 2024 | 6:05 PM

Suriya Kanguva Movie Postponed Speculation: హీరో సూర్యా కంగువా అనే ఒక వైవిధభరిత కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.

Suriya Kanguva Movie Postponed Speculation: హీరో సూర్యా కంగువా అనే ఒక వైవిధభరిత కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.

  • Published Aug 25, 2024 | 6:05 PMUpdated Aug 25, 2024 | 6:05 PM
సూర్యా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కంగువా సినిమా వాయిదా?

ఇండియన్ సినిమాలో రాబోయే నాలుగు నెలలు భారీ నుంచి అతి భారీ చిత్రాలు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇయర్ ఎండ్ వరకు టాప్ హీరోల సినిమాలు రిలీజులకు రెడీ అయిపోయాయి. వాస్తవానికి వచ్చే ఏడాది సంక్రాతి వరకు డేట్స్ లాక్ చేసేసుకున్నారు. అయితే రోజుల గడుస్తున్న కొద్దీ కొన్ని సినిమాలు ముందుకు రావడం.. మరికొన్ని సినిమాలు వెనక్కి వెల్లడం చూస్తూనే ఉన్నాం. టాప్ హీరోల చిత్రాలు అయినా కూడా కొన్నిసార్లు వాయిదా పడక తప్పడం లేదు. అది పూర్తిగా నిర్మాత తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 15కి రావాల్సిన ఇయర్ ఎండ్ కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరో సూర్యా కంగువా కూడా వాయిదా పడింది అనే వార్తలు వస్తున్నాయి.

విలక్షణ నటుడు సూర్యా కెరీర్ లో కంగువా కచ్చితంగా ఒక వైవిధ్య భరితమైన సినిమా అవుతుంది. ఈ మూవీని మొదట అక్టోబర్ 10న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు చూస్తే సూర్యా ఫ్యాన్స్ అయితే గుడ్ న్యూస్ అవుతుంది.. లేదంటే బ్యాడ్ న్యూస్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే కంగువా సినిమా వాయిదా పడబోతోంది అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, వాయిదా వేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అదే రోజున రేసులోకి రజినీకాంత్ వెట్టాయన్ వచ్చిన సంగతి తెలిసిందే.

kanguva postpone

రజినీ పోటీ దేనికి అని వెనక్కి తగ్గుతున్నారా? ఇంకా ఏదైనా వర్క్ కి సంబంధించి పెండింగ్ ఉందో తెలియదు. అయితే వాయిదా వార్తలు కూడా పూర్తిగా అధికారికంగా వచ్చినవి ఏమీ కాదు. ప్రస్తుతానికి అవి కేవలం పుకార్లు మాత్రమే. అక్టోబర్ నెలలో మరో డేట్ కోసం కంగువా ప్రయత్నిస్తోంది అని చెబుతున్నారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే.. అక్టోబర్ నెలలో రిలీజ్ కాస్త ముందుకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అక్టోబర్ 2న పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజున రిలీజ్ చేసేందుకు కూడా అవకాశం ఉంది అంటున్నారు. అలా చేస్తే ఎన్టీఆర్ నుంచి పోటీ ఎదుర్కోవాల్లి వస్తుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ రిజల్ట్ కంగువా మీద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోకుండా.. అక్టోబర్ లోనే ఇకో తేదీ సెలక్ట్ చేసుకుంటారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. సూర్యా కంగువా సినిమా వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss