iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

  • Published Nov 23, 2023 | 1:38 PM Updated Updated Nov 23, 2023 | 1:55 PM

​కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యకు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్‌ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆ వివరాలు..

​కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యకు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్‌ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆ వివరాలు..

  • Published Nov 23, 2023 | 1:38 PMUpdated Nov 23, 2023 | 1:55 PM
బ్రేకింగ్‌: షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరగడం వల్ల ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం గుర్తించిన వెంటనే చిత్ర యూనిట్‌ సూర్యను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారని సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సూర్య కంగువా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతుండగా.. ప్రమాదం చోటు చేసుకుందని.. వార్తలు వస్తున్నాయి. సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ సీన్‌ షూట్‌ చేస్తుండగా.. కెమరా, సూర్య మీద పడిందని సమాచారం.

ఈ ప్రమాదంలో సూర్య భుజానికి గాయం అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సూర్యకు ప్రమాదం అని తెలియడంతో.. ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సూర్య నటిస్తోన్న కంగువా చిత్రం.. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా. ఈ మూవీని ఏకంగా 38 భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. సినిమాలో యాక్షన్‌ సీన్లు.. చిత్రానికే హైలెట్‌గా ఉండనున్నాయి అంటున్నారు.

ఇప్పటికే కంగువా సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కంగువ సినిమాను 38 భాషల్లో 3డి, ఐమాక్స్ టెక్నాలజీలో విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్‌ తెలిపారు. అయితే ఇప్పటికే అనేక కారణాల వల్ల కంగువా రిలీజ్‌ ఆలస్యం అవుతుండగా.. తాజాగా సూర్య గాయపడటంతో.. మూవీ రిలీజ్‌ మరింత లేట్‌ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కుతోన్న కంగువా సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూర్య ఆరు రకాల పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక సూర్యకు తెలుగులో కూడా చాలా మంది అభిమానులున్నారు. కోలీవుడ్‌కు సమానంగా ఇక్కడ ఆయనకు క్రేజ్‌ ఉంది. దాంతో సూర్య ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది. అలానే కంగువా చిత్రం కూడా మన దగ్గర విడుదల కానుంది.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique