iDreamPost
android-app
ios-app

హమామ్ సోప్ యాడ్‌లో నటించిన పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

  • Published Apr 03, 2024 | 6:53 PM Updated Updated Apr 03, 2024 | 6:53 PM

తెలుగు ప్రేక్షకులకు సూర్యను దగ్గర చేసిన సినిమా గజిని. ఇందులో ఆసిన్, నయన తార హీరోయిన్లు. సంజయ్ రామస్వామి లవర్ అని భ్రమ పడటంతో ఆసిన్ లైఫ్ మారిపోతుంది. వెంటనే ఆమెకు యాడ్స్ ఆఫర్లు వస్తాయి. అందులో ఒకటి హమామ్. ఇదిగో అదే ఈ పిక్. ఇందులో పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు సూర్యను దగ్గర చేసిన సినిమా గజిని. ఇందులో ఆసిన్, నయన తార హీరోయిన్లు. సంజయ్ రామస్వామి లవర్ అని భ్రమ పడటంతో ఆసిన్ లైఫ్ మారిపోతుంది. వెంటనే ఆమెకు యాడ్స్ ఆఫర్లు వస్తాయి. అందులో ఒకటి హమామ్. ఇదిగో అదే ఈ పిక్. ఇందులో పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

  • Published Apr 03, 2024 | 6:53 PMUpdated Apr 03, 2024 | 6:53 PM
హమామ్ సోప్ యాడ్‌లో నటించిన పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

పేరుకే అతడు కోలీవుడ్ హీరో కానీ తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. పితామగన్ సినిమాతో (శివ పుత్రుడు) టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్ బాయ్.. గజినీతో ఇక్కడి హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి నుండి ఆయన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. ఆరు, నువ్వు నేను ప్రేమ, సింగం, సింగం సిరీస్, సెవన్త్ సెన్స్, 24, ఆకాశమే నీ హద్దురా, విక్రమ్ వరకు అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కంగువా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎన్నీ చేసిన గజినీ మాత్రం స్పెషల్ చిత్రంగా నిలిచిపోతుంది.

సూర్యను టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా గజినీ. 2005లో వచ్చిన ఈ సినిమా తమిళ బాక్సాఫీసునే కాదూ టీటౌన్‌లో కూడా కలెక్షన్లను కుమ్మేసింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందులో ఆసిన్, నయన తార హీరోయిన్లు కాగా, ప్రదీప్ రావత్ నెగిటివ్ రోల్‌లో నటించాడు. ఇందులో ఎయిర్ వాయిస్ సెల్ ఫోన్ కంపెనీ ఎండీగా సంజయ్ రామస్వామి పాత్రలో సూర్య, కల్పన పాత్రలో ఆసిన్ నటించారు. ‘కల్పనను నమ్మిన వారు కష్టాలు పాలవ్వరు’ అనే డైలాగ్‌తో కట్టిపడేస్తుంది ఆసిన్. యాడ్స్‌లో సైడ్ రోల్స్ చేసే కల్పన కోసం ఆ సంస్థ ప్రతినిధులు వెతుక్కుంటూ షూటింగ్ స్పాట్‌కు రావడంతో.. ఆమె లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారిగా కల్పన కాస్త.. కల్పన మేడమ్ అయిపోతుంది.

ఒక్కసారిగా సైడ్ క్యారెక్టర్ కాస్త మెయిన్ లీడ్‌గా మారిపోతుంది. ఇదిగో ఈ పిక్ ఆ సినిమాలోనిదే. ఇది అందులో వచ్చే హమామ్ యాడ్. ‘అమ్మా స్వచ్ఛత అంటే ఏంటమ్మా’ అని ఓ పిల్లవాడు అడగ్గానే..‘స్వచ్ఛత అంటే హమామ్ సోప్ రా నాన్న’ అంటూ ఓ యాడ్ చేస్తుంది. ఆ యాడ్‌లో నటించిన పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? ఇప్పుడు హీరో అయిపోయాడు. ఇంతకు ఆ అబ్బాయి పేరు చాణక్య. ఇప్పుడు అతడు తమిళ సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఎదరునీచల్ అనే తమిళ సీరియల్లో అరుణ్ పాత్రలో మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎస్ జేసూర్య హీరోగా నటించిన వ్యాపారి, అజిత్ పరమ శివన్ చిత్రంలో నటించాడు. ఘటికుడు చిత్రంలో చిన్నప్పటికీ సూర్య పాత్రలో నటించింది కూడా ఈ కుర్రాడే. కానీ కాస్త వీఎఫ్ఎక్స్ వాడి సూర్యగా చూపించారు. ప్రస్తుతం ఈ కుర్రాడు బుల్లితెరపై రాణిస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetparibu girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş