iDreamPost
android-app
ios-app

‘సెవన్త్ సెన్స్​’ను గుర్తుచేస్తున్న ‘కంగువ’.. వైరల్ అవుతున్న సూర్య తాజా లుక్!

  • Author singhj Published - 04:17 PM, Thu - 20 July 23
  • Author singhj Published - 04:17 PM, Thu - 20 July 23
‘సెవన్త్ సెన్స్​’ను గుర్తుచేస్తున్న ‘కంగువ’.. వైరల్ అవుతున్న సూర్య తాజా లుక్!

తమిళ సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలను తెలుగు అభిమానులు ఆదరిస్తూ వస్తున్నారు. రజినీకాంత్ దగ్గర నుంచి శివకార్తికేయన్ వరకు ఎందరో కోలీవుడ్ హీరోలను అక్కున చేర్చుకున్నారు తెలుగు ఆడియెన్స్. అయితే చాలా మంది తమిళ తంబీలు ఇక్కడకు ఎంట్రీ ఇచ్చినా వారిలో కొద్దిమంది మాత్రమే నిలదొక్కుకోగలిగారు. వైవిధ్యమైన కంటెంట్​తో మూవీస్​ను అందిస్తూ అద్భుతంగా నటించే హీరోలనే మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వారిలో హీరో సూర్య ఒకరు. ఆయనకు టాలీవుడ్​లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

‘శివపుత్రుడు’, ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘సెవన్త్ సెన్స్’, ‘సింగం’, ‘ఆకాశమే హద్దురా’, ‘విక్రమ్’, ‘జై భీమ్’ లాంటి సూర్య మూవీస్ తెలుగులో మంచి విజయాలు సాధించాయి. ఆయన నుంచి ఒక చిత్రం వస్తోందంటే చాలు.. చూసేందుకు ఫ్యాన్స్​తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా రెడీగా ఉంటారు. అలాంటి సూర్య ఈమధ్య కాలంలో మరింత జోష్​తో సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా ఆడియెన్స్​ను టార్గెట్ చేస్తూ తర్వాతి చిత్రాలను ఆయన లైనప్​లో పెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమానే ‘కంగువ’. హై రేంజ్ యాక్షన్​తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్​పై అంచనాలు తారస్థాయిలో ఏర్పడ్డాయి.

చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ‘కంగువ’కు మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్​తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తీస్తున్నారు. ‘కంగువ’ టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​ వీడియోను జులై 23న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అంతేకాదు, ‘కంగువ’ నుంచి సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్​ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో కండలు తిరిగిన ఓ భారీ చేతిని వెనుక వైపు నుంచి చూపించారు. ఆ చేతిపై వినూత్నమైన గుర్తులు ఉన్నాయి. హ్యాండ్​లో పెద్ద కత్తి కూడా ఒకటి ఉంది. ఈ లుక్ ‘సెవన్త్ సెన్స్’ మూవీని గుర్తుచేస్తోందని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ‘కంగువ’లో సూర్య తాజా లుక్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet