iDreamPost
android-app
ios-app

రాధిక కాలికి గాయం.. సూర్య తండ్రి శివ కుమార్ రాకతో

  • Published May 18, 2024 | 12:20 PM Updated Updated May 18, 2024 | 12:21 PM

‘కృష్ణమ్మకు.. గోదారికి తోడెవరమ్మా.. మమతల మందాకినీ మగువేనమ్మా’అంటూ టైటిల్లో పాట వచ్చే సీరియల్ పిన్ని. ఇందులో రాధిక, సూర్య తండ్రి శివకుమార్ కీలక పాత్రలు పోషించారు. కాగా, ఇప్పుడు..

‘కృష్ణమ్మకు.. గోదారికి తోడెవరమ్మా.. మమతల మందాకినీ మగువేనమ్మా’అంటూ టైటిల్లో పాట వచ్చే సీరియల్ పిన్ని. ఇందులో రాధిక, సూర్య తండ్రి శివకుమార్ కీలక పాత్రలు పోషించారు. కాగా, ఇప్పుడు..

  • Published May 18, 2024 | 12:20 PMUpdated May 18, 2024 | 12:21 PM
రాధిక కాలికి గాయం.. సూర్య తండ్రి శివ కుమార్ రాకతో

ఒకప్పటి టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో వెండితెరతో పాటు బుల్లితెరను కూడా ఏలేస్తుంది.రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం తెలుగు, తమిళ్ సీరియల్స్ నిర్మిస్తోంది. నిర్విరామంగా యాక్ట్ చేస్తోంది ఈ నటి. ఆమె భర్త శరత్ కుమార్ నటుడు అన్న సంగతి విదితమే. కాగా, ప్రస్తుతం రాధికకు కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంట్లో ఆమె రెస్ట్ తీసుకుంటుంది. ఈ సమయంలో ఆమెను అనుకోని అతిథి వచ్చి పలకరించడంతో ఆనందంలో మునిగి తేలిపోతుంది. ఆ ఇద్దరు కలిసి గతం తాలూకా జ్ఞాపకాలు చూసుకుంటూ మైమరిచిపోయారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని మురిసిపోతుంది రాధిక.

ఇంతకు ఆమె ఆనందానికి కారణమైన ఆ అతిథి ఎవరంటే.. శివ కుమార్. కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య, కార్తీల తండ్రి శివ కుమార్.. ఆమెను పరామర్శించడానికి వెళ్లాడు. దీంతో తన అన్న వచ్చాడని ఆనందంలో మురిసిపోయింది రాధిక. వీరిద్దరూ గతంలో పలు సినిమాల్లో నటించారు. అలాగే పిన్ని అనే సీరియల్లో కూడా కలిసి నటించారు. అన్నా చెల్లెల్లుగా యాక్ట్ చేయడంతో రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏర్పడింది వీరి మధ్య. దీంతో రాధికకు గాయం అయ్యిందని తెలుసుకుని ఆమెను పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు శివ కుమార్. ఇక అన్న వచ్చాడన్న ఆనందలో ఆనాటి స్మృతుల్లో మునిగి తేలారు ఈ అన్నా చెల్లెళ్లు. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది రాధిక.

‘కాలికి గాయమై కోలుకుంటున్న నన్ను చూడటానికి శివకుమార్ అన్న వచ్చాడు. అన్నతో అనుబంధం అలాంటిది. డ్రాయింగ్స్, పిక్చర్స్ చూపించాను. మా ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాం’ అంటూ పోస్టు చేసింది. రాధిక శరత్ కుమార్ కేవలం నటి మాత్రమే కాదు.. నిర్మాత, రాజకీయ వేత్త కూడా. ఇటీవలే ఆమె భర్త శరత్ కుమార్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజెపీ నుండి పోటీ చేసింది రాధిక. తమిళనాడులోని విరుధ్ నగర్ నుండి రాధిక శరత్ కుమార్ పోటీ చేసింది. ఇక ఇటీవల యానిమల్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎలా చూస్తున్నారంటూ కామెంట్స్ చేసి.. ట్రోల్సర్ చేతికి పని చెప్పినట్లయ్యింది. తాజాగా ఆమె వైష్ణవ్ తేజ్ మూవీ ఆదికేశవలో కనిపించింది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet