Somesekhar
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటికి మరో షాక్ తగిలింది. అతడిని ఆ అధ్యక్ష స్థానం నుండి తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటికి మరో షాక్ తగిలింది. అతడిని ఆ అధ్యక్ష స్థానం నుండి తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
సురేశ్ కొండేటి.. టాలీవుడ్ లో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫిల్మ్ జర్నలిస్ట్ గా, సంతోషం ఫిలిం అవార్డుల అధినేతగా అందరికి సుపరిచితుడే. అంతకంటే ఎక్కువగా మూవీ ప్రెస్ మీట్స్ లో తన ప్రశ్నల విన్యాసంతో హీరో, హీరోయిన్స్ ను ఇరకాటంలో పెడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల క్రితం సంతోషం ఫిలిం అవార్డులు గోవాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడి, నటీ, నటులు, సాంకేతిక నిపుణులతో పాటుగా చాలా మంది సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో టాలీవుడ్ కు అపకీర్తి తెచ్చిపెట్టాడు అని చాలా మంది విమర్శించారు. అదీకాక అతడిని ప్రెస్ మీట్స్ నుండి బ్యాన్ చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు, చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై సురేశ్ కొండేటికి తెలుగు నిర్మాతల మండలి ఒక నోటీసు కూడా ఇచ్చింది. తాజాగా సురేశ్ కొండేటికి మరో షాక్ తగిలింది. అతడిని ఆ అధ్యక్ష స్థానం నుండి తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
గోవాలో ఇటీవల జరిగిన సంతోషం ఫిలిం అవార్డుల వేడుకలో జరిగిన గందరగోళం గురించి అందరికి తెలిసిందే. వేడుక మధ్యలోనే కరెంట్ పోవడం, సెలబ్రిటీల ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సురేశ్ కొండేటి వేడుక నిర్వహణ సరిగ్గా నిర్వహించలేదని, దీంతో టాలీవుడ్ కు అపకీర్తి తెచ్చిపెట్టాడని బడా నిర్మాతలు విమర్శించారు. ఇక ఈ విషయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలి ఒక నోటీసును సైతం అతనికి ఇచ్చింది. వీటిపై స్పందించిన సురేశ్ కొండేటి తప్పు దొర్లిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే తాము పంపిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేదని నిర్మాతల మండలి తెలిపింది.
ఇదిలా ఉండగా.. తాజాగా డిసెంబర్ 25 సోమవారం రోజున సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఫిల్మ్ క్రిటిక్ అసోషియేషన్ (FCA)ఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో FCA అధ్యక్షుడిగా ఉన్న సురేశ్ కొండిటి అంశంపై చర్చించారు. అందులో భాగంగానే ఫిలిం ఛాంబర్ గోవా ఫిలిం అవార్డు వేడుకలోనే పరిశ్రమ పరువుపోయిందని భావించి.. ఎఫ్ సీఏకు సురేశ్ కొండేటిపై చర్చలు తీసుకోవాలని లేఖ రాసింది. తాజాగా జరిగిన ఈ మీటింగ్ లో సుదీర్ఘ విచారణ తర్వాత ఎఫ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న సురేశ్ కొండేటిని తొలగిస్తున్నట్లు ఈసీ ఏకగ్రీవ తీర్మానించిందని ఫిలిం క్రిటిక్స్ ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి నుంచి సురేశ్ కొండేటిని తొలగించినట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మీడియాకు తెలిపారు. మరి సురేశ్ కొండేటిని ఎఫ్ సీఏ అధ్యక్షుడిగా తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#SureshKondeti banned from Film chamber , Producer’s council and Film’s critic Association removes his position. pic.twitter.com/xTNsINbp7k
— TrackTollywood (@TrackTwood) December 26, 2023
Awards Event Mismanagement Fiasco :
Santosham Suresh Kondeti Expelled from Telugu Film Producers Council and Telugu Film Chamber of Commerce. Also Removed as Film Critics Association President. pic.twitter.com/i1rRKPRTGn
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 26, 2023