iDreamPost
android-app
ios-app

‘జైలర్’ సినిమా బాలేదు అన్నందుకు చితకబాదిన ఫ్యాన్స్! వీడియో వైరల్!

  • Author ajaykrishna Updated - 11:01 AM, Fri - 11 August 23
  • Author ajaykrishna Updated - 11:01 AM, Fri - 11 August 23
‘జైలర్’ సినిమా బాలేదు అన్నందుకు చితకబాదిన ఫ్యాన్స్! వీడియో వైరల్!

అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే.. అసలు చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రజినీ సినిమా కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా భారీ అంచనాల మధ్య సూపర్ స్టార్ జైలర్ సినిమా విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా.. మార్నింగ్ షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. చాలా గ్యాప్ తర్వాత రజినీ సూపర్ హిట్ కొట్టేశాడని సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో థియేటర్ వద్ద ఓ యువకుడు సినిమా బాలేదంటూ కామెంట్ చేశాడు.

ఇంకేముంది.. అసలే సినిమా హిట్ అని ఊపులో ఉన్న తలైవా ఫ్యాన్స్.. బాలేదని కామెంట్ చేసిన యువకుడిని ఆ జనాల మధ్యే కుమ్మేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. సినిమా బాలేదంటూ కామెంట్ చేసిన యువకుడు.. దళపతి విజయ్ అభిమాని అని అంటున్నారు. కావాలనే రజినీ సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కాగా.. సూపర్ స్టార్ రజినీ 169వ సినిమాగా జైలర్ మూవీని.. డాక్టర్, బీస్ట్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించాడు. సాంగ్స్, ట్రైలర్ లతో భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా.. బిగ్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.

ఓ సాధారణ జైలర్.. అతిక్రూరంగా ఎలా మారాడు? అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా.. స్టార్స్ శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలలో నటించారు. రజినీ నుండి మాస్ సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి.. ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ఇచ్చాడని డైరెక్టర్ నెల్సన్ ని.. ఆకాశానికి లేపుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. సినిమా ఫస్టాఫ్ అదిరిపోయిందని.. సెకండాఫ్ కొంచం ట్రిమ్ చేసుంటే బాగుండేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కానీ.. ఓరల్ సినిమా సూపర్ హిట్ అని టాక్ వచ్చింది. ఇంతలో ఇలా నెగిటివ్ కామెంట్ చేసి దెబ్బలు తిన్నాడు ఓ యువకుడు. మరి జైలర్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş