iDreamPost
android-app
ios-app

మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఇంతకి ఎక్కడో తెలుసా.?

  • Published Apr 25, 2024 | 1:46 PM Updated Updated Apr 25, 2024 | 1:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే హైదరాబాద్ లో ఏషియన్‌ సంస్థతో కలిసి గచ్చిబౌలితో మల్టీప్లెక్స్ బిజినెస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మహేష్ మరో కొత్త మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించనున్నారు. ఇంతకి ఎక్కడంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే హైదరాబాద్ లో ఏషియన్‌ సంస్థతో కలిసి గచ్చిబౌలితో మల్టీప్లెక్స్ బిజినెస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మహేష్ మరో కొత్త మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించనున్నారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 25, 2024 | 1:46 PMUpdated Apr 25, 2024 | 1:46 PM
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఇంతకి ఎక్కడో తెలుసా.?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ వ్యాపారాలు చేయడం కొత్త విషయమేమీ కాదు. చాలా ఏళ్ల నుంచి మన సెలబ్రిటీ తారాలు ఓ వైపు సినిమాలతో పాటు మరో వైపు బిజినెస్ లు చేస్తూ రెండు చేతులతో సంపాదించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఫుడ్ బిజినెస్, జిమ్, బ్రాండడ్ కాస్మోటిక్స్ ఇలా రకరకాల వ్యాపారాల్లో తమ సత్తా చాటుతుంటే.. మరికొందరు మాత్రం సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు. కాగా, ఒకప్పుడు సినిమా తారలు ప్రొడక్షన్స్ హౌజ్‌ను ఎక్కువగా రన్‌ చేసే వారు. కానీ, ప్రస్తుతం హీరోలు అందరూ సినిమా థియేటర్ల వైపు ఆసక్తి చూపుతూ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మల్లీప్లెక్స్‌ కల్చర్‌ ఆదరణ ఎక్కువగా పెరుగుతున్న తరుణంలో.. మన స్టార్ హీరోలందరూ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నా సంగతి తెలిసిందే.

అయితే ఆ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారనే చెప్పవచ్చు. ఇప్పటికే మహేష్‌ బాబు ఏఎమ్‌బీ పేరుతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తొలి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే భారీ స్క్రీన్‌లతో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్‌ మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్‌ బాబు తన ఏఎంబీ మల్లీప్లెక్స్ బిజినెస్ ను విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ప్రాంతంలో ఈ సేవలను నూతనంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..

ఇప్పటికే హైదరాబాద్ లో ఏషియన్‌ సంస్థతో కలిసి గచ్చిబౌలితో మల్టీప్లెక్స్ బిజినెస్ ను రన్ చేస్తున్న మహేష్ బాబు త్వరలోనే.. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో కూడా మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్నట్లు గతంలో టాక్ వినిపించింది. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మాత్రం మహేష్‌ ఏఎంబీని బెంగళూరుకు విస్తరించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.  పైగా ఈ విషయం పై ఏషియన్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్ర‌క‌టించింది.  ఇక త్వరలోనే ఈ మల్టీప్లెక్స్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుంది. అయితే ఇప్పటికే ఈ మల్లీప్లెక్స్ బిజినెస్ లో మహేష్ బాబుతో పాటు  ఇతర హీరోలు కూడా ఈ బిజినెస్ లో కొనసాగుతున్నారు. కాగా, వారిలో ‘అల్లు అర్జున్’ ( AAA సినిమాస్) ‘విజయ్ దేవరకొండ’ (AVDసినిమాస్) పేరుతో మల్టీప్లెక్స్ ను ప్రారంభించగా.. ఇక ఇప్పుడు వీరి బాటలోనే రవితేజ సైతం ఏషియన్‌ సంస్థతో కలిసి ఏఆర్‌టీ సినిమాస్‌ పేరుతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరి, త్వరలో మహేష్ బాబు బెంగళూర్ లో మరో మల్టీప్లెక్స్ బిజినిస్ ను ప్రారంభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş