Swetha
కన్నుల పండుగగా అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్టాపన దివ్యంగా సుందరంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై స్పందించారు.
కన్నుల పండుగగా అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్టాపన దివ్యంగా సుందరంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై స్పందించారు.
Swetha
గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ.. ఎవరి నోట విన్నా అంతా ఒకటే మాట. అదే అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన. వందల ఏళ్ళ శత్రుత్వానికి, పదుల ఏళ్ళ దాతృత్వానికి.. అంతం పలికి. ఆ అయోధ్య రామయ్య లోకాలను ఏలే దిశగా పదిలంగా తన స్థానంలో కొలువుతీరాడు. ఈ రామ మందిరాన్ని నిర్మించడం కోసం.. ఎంతో మంది తమ వంతు సాయం చేశారు. చివరికి ఈరోజున అయిన వారి అందరి మధ్యన బాల రాముడు తన పుట్టినింట ఘనంగా ప్రతిష్టింపబడ్డాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా.. కనుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖుల హాజరయ్యారు. వారితో పాటు సినీ సెలెబ్రిటీలు సైతం.. ఈ మహత్తర తరుణాన్ని ప్రత్యేక్షంగా వీక్షించడం కోసం అయోధ్యకు చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవ అనంతరం పలువురు సెలెబ్రిటీలు ఈ విషయమై స్పదించారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు.
అయోధ్య ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి.. దాదాపుగా టాలీవుడ్ హీరోలు అందరు హాజరయ్యారు. ఆ రామునిపైన తమకు ఉన్న భక్తిని చాటుకున్నారు. అయోధ్యలో ఈ మహత్తర ఘట్టాన్ని చూసిన వారంతా .. సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్త పరిచారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన విషయమై చెబుతూ.. “చరిత్ర యొక్క ప్రతిధ్వనులు మరియు విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో రామమందిరాన్ని గొప్పగా ప్రారంభించడం.. ఐక్యత మరియు ఆధ్యాత్మికతకు ఉన్న చిహ్నాన్ని తెలియజేస్తుంది. చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది!” అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికల్లో అరుదుగా స్పదించే మహేష్ బాబు ఇలా ఈరోజున అయోధ్య రామ మందిరం గురించి చెప్పడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎంతో మంది సెలెబ్రిటీలు అయోధ్య రామ మందిరంపై.. వారికి కలిగిన భావాలను వ్యక్తపరిచారు.
ఇక అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన విషయానికొస్తే.. ఈ అపురూప ఘట్టంలో స్టార్ సెలెబ్రిటీలంతా పాలు పంచుకున్నారు. కన్నులార ప్రత్యేక్షంగా ఈ మహత్తర సన్నివేశాలను తిలకించేందుకు.. ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలని అక్కడకు వెళ్లిన వారంతా భావిస్తున్నారు. అలాగే అక్కడకు వెళ్లలేని వారు తమ ఇళ్లవద్ద నుంచే ఈ కార్యక్రమాలని లైవ్ లో వీక్షించారు. ఈ సందడి వాతావరణం దేశమంతటా విస్తృతంగా వ్యాప్తి చెంది.. అందరి ఇళ్లకు సరికొత్త శోభను తీసుకుని వచ్చాయని చెప్పి తీరాలి. నేడు యావత్ భారతదేశం రామ నామ స్మరణతో.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. ఏదేమైనా ధగ ధగ మెరుస్తున్న ఆ బాల రాముడిని చూస్తే ఎవరైనా మంత్ర ముగ్ధులు కావాల్సిందే. మరి, మహేష్ బాబు అయోధ్య రామ మందిరపై చేసిన ట్వీట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024