iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: ఓవర్సీస్ లో ప్రభాస్ జోరు.. ఒక్కరోజులో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే?

  • Published Jun 07, 2024 | 4:19 PM Updated Updated Jun 07, 2024 | 4:19 PM

ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది కల్కి 2898 ఏడీ మూవీ. అయితే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ జోరు చూపిస్తున్నాడు. ఒక్కరోజులో ఎన్ని టికెట్స్ తెగాయంటే?

ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది కల్కి 2898 ఏడీ మూవీ. అయితే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ జోరు చూపిస్తున్నాడు. ఒక్కరోజులో ఎన్ని టికెట్స్ తెగాయంటే?

  • Published Jun 07, 2024 | 4:19 PMUpdated Jun 07, 2024 | 4:19 PM
Kalki 2898 AD: ఓవర్సీస్ లో ప్రభాస్ జోరు.. ఒక్కరోజులో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే?

‘కల్కి 2898 ఏడీ’.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులతో పాటుగా హాలీవుడ్ సినీ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక వారిని అలరించడానికి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది ఈ మూవీ. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సల్మాన్ దుల్కర్ వంటి భారీ క్యాస్టింగ్ తో ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది కల్కి. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మరి ఒక్కరోజులో ఎన్ని టికెట్స్ బుకింగ్ అయ్యాయంటే?

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. స్టార్ ప్రొడ్యూస్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగానే అంటే జూన్ 26నే విడుదల కానుంది. దాంతో అక్కడ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కల్కి మూవీకి అక్కడ భారీ క్రేజ్ ఉండటంతో.. ఓ రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి.

విదేశాల్లో కల్కి మూవీని 124 లోకేషన్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో.. ఒక్కరోజులోనే 4933 టికెట్లు అమ్ముడైపోయాయి. ప్రభాస్ మూవీకి భారీ డిమాండ్ ఉండటంతో.. త్వరలోనే థియేటర్ల సంఖ్యను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడే ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. కల్కి మూవీతో ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగ కనిపిస్తోంది. బాహుబలి 2 రేంజ్ లో కలెక్షన్లు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కాగా.. కల్కి ట్రైలర్ జూన్ 10న రిలీజ్ కానుంది. దానికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో జూన్ 22 లేదా 23న మేకర్స్ నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుండటంతో.. ముంబైలో సైతం ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, బుజ్జీ గ్లింప్స్, అశ్వత్థామ ప్రోమో ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో కల్కిపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి కల్కి విడుదలైన తర్వాత ఏం రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss