iDreamPost
android-app
ios-app

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ.. అసలేం జరిగిందంటే

  • Published Apr 30, 2024 | 7:53 AM Updated Updated Apr 30, 2024 | 7:53 AM

ఈమధ్య కాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్న నటీనటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో నటి చేరింది. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్న నటీనటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో నటి చేరింది. ఆ వివరాలు..

  • Published Apr 30, 2024 | 7:53 AMUpdated Apr 30, 2024 | 7:53 AM
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ.. అసలేం జరిగిందంటే

ఈమధ్యకాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్న సినీ సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌ నటి డింపుల్‌ హయతి ఇలానే విదాదంలో చిక్కుకుంది. పోలీసు ఉన్నతాధికారిపై విమర్శలు చేసి కోర్టు వరకు వెళ్లింది. ఇక కొన్ని రోజుల క్రితం రఘువరన్‌ సినిమాలో తల్లి పాత్రలో నటించిన నటి కూడా ఇలానే వివాదంలో చిక్కుకుంది. అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో నటి వచ్చి చేరింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మీద దాడి చేసింది. అతడిని చితకబాదింది ఓ నటి. ఆ వివరాలు..

కోలివుడ్‌ నటి ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాది.. వార్తల్లో నిలిచారు. ఇంతుకు ఆ నటి ఎవరంటే.. సుందరా ట్రావెల్స్‌ చిత్ర కథానాయకి రాధ. ఈ నటికి వివాదాలు కొత్త కాదు.. ఈక్రమంలో తాజాగా మరో కాంట్రవర్సీలో ఇరుక్కుంది. పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నై, నెర్కుం డ్రం, పల్లవన్‌నగర్‌ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన మురళీకృష్ణన్‌ (48) అనే వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, ఎల్‌ఐసీ ఏజెంట్‌గానూ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్నేహితుడు ద్వారకేశ్‌ ద్వారా.. మురళీకృష్ణన్‌కి నటి రాధ పరిచయం అయింది.

ఈ నేపథ్యంలో నటి రాధ రెండేళ్ల క్రితం మురళీకృష్ణన్‌ వద్ద 90 వేలు బిట్‌ కాయిన్స్‌ పెట్టుబడి పెట్టింది. కానీ అతడు అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ బిట్‌ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదని చెప్పుకొచ్చాడు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ ద్వారా మురళీకృష్ణన్‌ను కలిసి.. తన బిట్‌ కాయిన్స్‌ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసిందని తెలిపాడు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు, మరో ముగ్గురు కలిసి.. స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు.

వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరులు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని మురళీకృష్ణన్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. కానీ నటి.. మురళీకృష్ణన్‌ మీద దాడి చేయడం మాత్రం సంచలనంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet