iDreamPost
android-app
ios-app

ఆ హీరోల లిస్టులో సందీప్.. ఈసారి అదృష్టం ఎలా ఉందో!

  • Author ajaykrishna Updated - 01:11 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Updated - 01:11 PM, Wed - 27 September 23
ఆ హీరోల లిస్టులో సందీప్.. ఈసారి అదృష్టం ఎలా ఉందో!

ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ తో ఫామ్ మెయింటైన్ చేస్తున్న హీరోలు కొందరైతే.. ప్లాప్స్ పడినా క్రేజ్ ని నిలబెట్టుకుంటున్న హీరోలు ఇంకొందరు. సెలెక్టివ్ గా తమకు సూట్ అయ్యే సినిమాలు చేసుకునే హీరోలు మొదటి రకమైతే.. ప్రయోగాలు చేస్తూ విభిన్నమైన సినిమాలు అందించే ప్రయత్నంలో కొందరు ఉన్నారు. అలాంటి వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. చాలా కాలంగా సందీప్ ఓ సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు కానీ కుదరట్లేదు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు బాగున్నాయని అనిపించుకున్నా.. ఫలితం విషయంలో తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో పరుగెత్తి పాలు తాగకుండా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ క్రమంలో సందీప్ మునుపటిలా వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేసేసి లైన్ లో పెట్టకుండా.. ఒక్కో సినిమా ఎంపిక చేసుకుంటున్నాడు. చివరిగా ఎన్నో ఆశల మధ్య మైఖేల్ మూవీ చేశాడు. ఆ సినిమాపై విపరీతంగా నమ్మకం పెట్టుకున్న సందీప్ కి.. ఎదురు దెబ్బే తగలింది. ప్లాప్ లలో ఉన్నా మైఖేల్ తో ఒకేసారి పాన్ ఇండియా కుంభస్థలం కొడదాం అనుకున్నాడేమో.. కానీ, అదృష్టం సహకరించలేదు. సినిమా ప్లాప్ అయిపోవడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే.. ప్రస్తుతం సందీప్ ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ లో కీలకపాత్ర పోషిస్తూ.. విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. కొత్తగా తన కెరీర్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ మాయావన్ (తెలుగులో ప్రాజెక్ట్ Z)కి సీక్వెల్ అనౌన్స్ చేశాడు. 2017లో వచ్చిన ఆ సినిమా సందీప్ కి తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఆ సినిమాలో తెలుగులో ప్రాజెక్ట్ Z గా డబ్ అయ్యింది. ఇప్పుడీ సూపర్ హిట్ సీక్వెల్ అనౌన్స్ చేసి.. సందీప్ కూడా సీక్వెల్స్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడని సినీ వర్గాల సమాచారం. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్, రవితేజ, నిఖిల్.. ఇలా చాలామంది తెలుగు హీరోలు సీక్వెల్స్ చేసి అదృష్టం పరీక్షించుకున్నారు. మరి ఇప్పుడు అదే లిస్ట్ లో చేరుతున్న సందీప్ అదృష్టం ఎలా ఉందో చూడాలి. మరి సందీప్ కిషన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş