Sudigali Sudheer: లైవ్​లో ప్రపోజ్ చేసిన సుధీర్​! ఈ కొత్తమ్మాయి ఎవరంటూ చర్చ!

బుల్లితెర నుంచి వెండితరకు చేరుకొని విజయవంతమైన అతికొద్ది మంది యాక్టర్స్​లో సుడిగాలి సుధీర్ ఒకరు. తన నటన, కామెడీ టైమింగ్​తో కడుపుబ్బా నవ్వించే ఆయన.. హీరోగా మారి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

బుల్లితెర నుంచి వెండితరకు చేరుకొని విజయవంతమైన అతికొద్ది మంది యాక్టర్స్​లో సుడిగాలి సుధీర్ ఒకరు. తన నటన, కామెడీ టైమింగ్​తో కడుపుబ్బా నవ్వించే ఆయన.. హీరోగా మారి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

బుల్లితెర నుంచి వెండితరకు చేరుకొని విజయవంతమైన అతికొద్ది మంది యాక్టర్స్​లో సుడిగాలి సుధీర్ ఒకరు. తన నటన, కామెడీ టైమింగ్​తో కడుపుబ్బా నవ్వించే ఆయన.. హీరోగా మారి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఫుల్ పాపులారిటీ సాధించారు సుధీర్. హైపర్ ఆదితో కలసి కామెడీ పంచులు వేస్తూ మంచి క్రేజ్​ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే సీరియస్​గా తీసుకోలేదు. కానీ క్రమంగా హీరోగా మూవీస్ చేయడం స్టార్ట్ చేశారు. ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’ చిత్రాలతో విజయాలు అందుకున్నారు. అలాంటి సుధీర్ తాజాగా లైవ్​లో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ అమ్మాయి ఎవరని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఓ టీవీ షోలో ‘కాలాలు కళ్లారా చూసేను లే’ పాటకు సుధీర్ సూపర్బ్​గా డ్యాన్స్ చేశారు. రొమాంటిక్ సాంగ్​కు తగ్గట్లుగా స్టెప్స్ వేశారు. ఆయనతో ఓ అమ్మాయి ఈ పాటలో అదరగొట్టింది. బ్లూ కలర్ శారీలో మెరిసింది. ఆ అమ్మాయికి ఫ్లవర్స్ ఇచ్చి సుధీర్ ప్రపోజ్ చేయడం, ఆమెతో చేసిన డ్యాన్స్ హైలైట్​గా నిలిచాయి. అయితే ఆమె ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో అసలు ఎవరీ అమ్మాయి? ఆమెకు సుధీర్​కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ షో కోసమే అయితే ఫేస్ చూపించేవాళ్లు కదా! సుధీర్ ఏమైనా ఈ షోలో తన లవర్​ను పరిచయం చేశారా? ఇలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక, సినిమాల పరంగా మరింత వేగం పెంచారు సుడిగాలి సుధీర్. మంచి సబ్జెక్ట్​లు వస్తే ఓకే చేసుకుంటూ పోతున్నారు. ఈ తరుణంలో తాజా డ్యాన్స్ వీడియోతో మరోసారి ఆయన లవ్ లైఫ్​పై రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడా? అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని పక్కనబెడితే.. సుధీర్ డ్యాన్స్ చేసిన షోలో న్యాచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్​గా పాల్గొన్నారు. ఆది, సుధీర్ కలసి ఫుల్ కామెడీతో ఆకట్టుకున్నారు. స్టార్ యాంకర్ సుమ కూడా వీళ్లిద్దరిపై పంచులు వేస్తూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. ఆటో రామ్ ప్రసాద్ తదితరులు కూడా ఇందులో సందడి చేశారు. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్స్​లో భాగంగా ఈ షోలో ఆయన మెరిశారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. మరి.. సుధీర్​ లైవ్​లో ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరై ఉంటారు? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments