iDreamPost
android-app
ios-app

సుధామూర్తిని ఏడిపించిన ప్రముఖ హీరోయిన్‌!

  • Published Jul 24, 2023 | 1:15 PM Updated Updated Jul 24, 2023 | 1:15 PM
  • Published Jul 24, 2023 | 1:15 PMUpdated Jul 24, 2023 | 1:15 PM
సుధామూర్తిని ఏడిపించిన ప్రముఖ హీరోయిన్‌!

సుధామూర్తి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ఇన్‌ఫోసిస్‌’ సంస్థ అధినేత నారాయణ మూర్తి భార్యగానే కాదు.. సామాజికవేత్తగా, రచయితగా ఆమెకంటూ ఓ మంచి గుర్తింపు ఉంది. ఇక, సుధామూర్తికి సినిమాలంటే ఎంతో ఇష్టం. భాషతో సంబంధం లేకుండా.. అన్ని భాషల సినిమాలను ఆమె చూస్తూ ఉంటారు. చాలా ఇంటర్వ్యూల్లో ఆమె ఇదే విషయాన్ని చెప్పారు. తాను ఇంజినీర్‌ కాకపోయి ఉంటే.. కచ్చితంగా సినిమా క్రిటిక్‌ అయ్యేదానినని కూడా అన్నారు.

తాజా, ఇంటర్వ్యూలో సుధామూర్తి ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటన గురించి మాట్లాడారు. ఆమె నటనతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని కూడా అన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ ప్రతీ ఏటా నా ఫేవరేట్‌ సినిమా తారలు మారుతూ ఉంటారు. మొదట్లో దిలీప్‌ కుమార్‌ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. తర్వాత రాజేష్‌ ఖన్నా.. హృతిక్‌ రోషన్‌, షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌.. నేను వీరి సినిమాలు చూసి ఎంజాయ్‌ చేస్తూ ఉంటా. నాకు ఆయుష్మాన్‌ ఖురానా అన్నా కూడా చాలా ఇష్టం.

నాకు హీరోయిన్స్‌లో వైజయంతిమాల అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న వారిలో ఆలియా భట్‌ గొప్ప నటి అని నేను భావిస్తున్నా.. నేను సాధారణంగా థియేటర్లలో ఏడవను. కానీ, ఆమె నటించిన ‘రాజీ’ సినిమా చూసినపుడు ఏడ్చాను. ఆమె మంచి నటి. నేను సినిమాల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటాను. మ్యూజిక్‌, ఎడిటింగ్‌ ఇతర విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటాను’’ అని అన్నారు. మరి, ఆలిమా భట్‌ నటనతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానన్న సుధామూర్తి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş