iDreamPost
android-app
ios-app

సుధా కొంగర ప్రాజెక్ట్ నుండి సూర్య ఔట్.. శివ కార్తీకేయన్ ఇన్..!

  • Published Jul 17, 2024 | 5:21 PM Updated Updated Jul 17, 2024 | 5:21 PM

Siva Karthikeyan In Puranaanooru.. టాలీవుడ్, కోలీవుడ్ మహిళా దర్శకుల్లో ఒకరు సుధా కొంగర. ఇటీవల అక్షయ్ కుమార్ తో సర్ఫిరా అని తెరకెక్కించగా.. బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఆమె గతంలో సూర్యతో కలిసి ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆమె మూవీకి పురాణనూర్ అనే పేరును కూడా ఖరారు చేశారు. ఇదిలా ఉంటే..

Siva Karthikeyan In Puranaanooru.. టాలీవుడ్, కోలీవుడ్ మహిళా దర్శకుల్లో ఒకరు సుధా కొంగర. ఇటీవల అక్షయ్ కుమార్ తో సర్ఫిరా అని తెరకెక్కించగా.. బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఆమె గతంలో సూర్యతో కలిసి ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆమె మూవీకి పురాణనూర్ అనే పేరును కూడా ఖరారు చేశారు. ఇదిలా ఉంటే..

  • Published Jul 17, 2024 | 5:21 PMUpdated Jul 17, 2024 | 5:21 PM
సుధా కొంగర ప్రాజెక్ట్ నుండి సూర్య ఔట్..  శివ కార్తీకేయన్ ఇన్..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫింగర్ టిప్స్ పై లెక్కించగలిగేంత మంది మహిళా దర్శకులు ఉన్నారు. వారిలో ఒకరు సుధా కొంగర. తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళనాడులో పెరగడం వల్ల.. కోలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు గుర్తింపు నిచ్చింది ఇరుది సుత్రు.. ఇది తమిళం, హిందీలోనే కాకుండా తెలుగులో కూడా గురు పేరుతో రీమేక్ అయ్యి సక్సెస్ అందుకుంది. ఆమె పేరు మార్మోగేలా చేసిన మూవీ సూర్య,  అపర్ణా బాల మురళీ హీరోహీరోయిన్లుగా వచ్చిన సూరారై పోట్రు (ఆకాశమే హద్దురా). ఈ సినిమా ఎన్ని అవార్డులను తెచ్చిపెట్టిందో చెప్పనక్కర్లేదు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్‌తో సహా పలు కేటగిరీల్లో జాతీయ అవార్డులు కూడా కొల్లగొట్టింది. ఇదే మూవీని ఇటీవల హిందీలో అక్షయ్ కుమార్‌తో సర్ఫిరా అని తెరకెక్కించగా.. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఇదిలా ఉంటే.. సూర్యతో కలిసి మరో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసింది సుధాకొంగర. పురాణనూరు అనే పేరు కూడా ప్రకటించారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మీనాక్షి సినిమాస్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తుండగా.. సుధా కొంగర తెరకెక్కిస్తుంది. ఈ చిత్రంలో సూర్య, దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్, మాధవన్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారన్న టాక్ వచ్చింది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మధురైకి చెందిన గ్యాంగ్‌స్టర్.. తనకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే కథగా తెరకెక్కితున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య ద్విపాత్రిభినయం చేస్తున్నాడన్న టాక్ నడించింది. అయితే టైటిల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది కానీ.. సినిమా పట్టాలెక్కినట్లు దాఖలాలు లేవు.

ఇప్పుడు ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పురాణనూర్ మూవీ నుండి సూర్య తప్పుకున్నట్లు తెలుస్తుంది. సూర్య స్థానంలో శివకార్తికేయన్ నటించనున్నట్లు సమాచారం. అలాగే నిర్మాణ సంస్థ కూడా వైదొలిగినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అలాగే 2డి నిర్మాణం నుంచి వైదొలుగుతున్నట్లు, దానికి బదులు కొత్త నిర్మాత ఆకాష్ కృష్ణన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. కాల్‌షీట్‌ సహా పలు సమస్యల కారణంగా సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇన్ సైడ్ టాక్. దీంతో సూర్య స్థానంలో శివకార్తికేయన్ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య కంగువా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక శివకార్తికేయన్ విషయానికి వస్తే ఆయన తదుపరి చిత్రం ‘అమరన్’ విడుదల కానుంది. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆయన ‘పూరణనూరు’ సినిమాలో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş