iDreamPost
android-app
ios-app

క్యాస్టింగ్ కౌచ్ పై ‘తమ్ముడు’ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. అందుకు ఒప్పుకోలేదని..

  • Published Dec 07, 2023 | 10:08 PM Updated Updated Dec 07, 2023 | 10:08 PM

'అదితి గోవిత్రికర్' అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. ఈమె పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంలో.. లవ్లీ పాత్రలో నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

'అదితి గోవిత్రికర్' అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. ఈమె పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంలో.. లవ్లీ పాత్రలో నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

  • Published Dec 07, 2023 | 10:08 PMUpdated Dec 07, 2023 | 10:08 PM
క్యాస్టింగ్ కౌచ్ పై ‘తమ్ముడు’ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. అందుకు ఒప్పుకోలేదని..

మీటూ మూమెంట్ ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ తమ వ్యక్తిగత జీవితాలలోని సమస్యలను చెప్పుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎంతో మంది నటీ నటులు వారి సినీ కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై సీనియర్ నటులు ఓ ఇంటర్వ్యూలో తాము ఎదుర్కున్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను చెప్పుకొచ్చారు. తమ్ముడు మూవీ ఫేమ్ అదితి గోవిత్రికర్, సుచిత్రా కృష్ణమూర్తి వారి చేదు అనుభవాలను వ్యక్తపరిచారు.

‘అదితి గోవిత్రికర్’ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. ఈమె పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంలో.. లవ్లీ పాత్రలో నటించింది. ఆ చిత్రంలోని తన పాత్ర ఎవరికీ తెలియకపోయినా.. ‘వయ్యారి భామ నీ హంస నడక.. ఎందుకె తొందర తొందర.. ‘ అనే పాట వింటే మాత్రం ఈ అమ్మడు గుర్తొచ్చేస్తుంది. అయితే ఈ బాలీవుడ్ భామ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను చెప్పుకొచ్చింది. “ఓ ప్రముఖ చిత్రం కోసం నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ ఓ వ్యక్తి నాకు అనవసరంగా హింట్ ఇస్తున్నాడని నేను అర్ధం చేసుకోలేకపోయాను. దానితో అతనితో ఎక్కువ మాట్లాకుండా అతని ముఖం మీదనే నవ్వి ‘నీకేమైనా పిచ్చా’ అని అనేసి వెళ్ళిపోయాను. కానీ దాని వలన అతని ఇగో హర్ట్ అయింది. దానితో నన్ను ఆ సినిమాలో నుంచి తీసేశారు. ఎప్పుడూ ఎదో ఒక కారణం చెప్తూ ఉండేవారు. నాకు అప్పుడే అర్థమైంది. కేవలం నేను దానికి ఒప్పుకోకపోవడం వలనే నన్ను సినిమా నుంచి తీసేశారు”. అంటూ అదితి చెప్పుకొచ్చింది. అయితే అసలు ఏ సినిమా షూటింగ్ సందర్భంలో ఈ సంఘటన జరిగింది . దానికి కారణం ఎవరు అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.

thammudu movie heroine

కాగా.. మరో నటీమణి సుచిత్రా కృష్ణమూర్తి కూడా తనకు జరిగిన ఓ సంఘటనను వ్యక్తపరిచింది. ‘కభీ హా కభీ నా’ ఫేమ్ సుచిత్రా కృష్ణమూర్తి తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మాట్లాడుతూ.. “ఒక సినిమా మీటింగ్ కోసం ఓ వ్యక్తిని హోటల్ లో కలిశాను. ఆరోజుల్లో మీటింగ్స్ అన్ని ఇలా హోటల్స్ లోనే జరిగేవి. ఆ క్రమంలో నేను నా తండ్రితో చాలా దగ్గరగా ఉంటానని అతనితో చెప్పాను. ‘అయితే, మంచిదే. మీ నాన్నకు కాల్ చేసి రేపు పొద్దున వస్తానని చెప్పు అన్నాడు’. నాకు ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయి. వెంటనే అక్కడినుంచి పారిపోయాను. ఇలాంటి మాటలు వెంటనే అర్థంకావు. ఆ రాత్రంతా ఉండి ఏం చేయాలి అనుకునాన్నే కానీ.. ఆ వ్యక్తి మాటల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో నాకు తర్వాత అర్థమయ్యింది”. అని సుచిత్రా చెప్పారు.

thammudu movie heroine

ఇలా ఇండస్ట్రీలోని నటీ మణులు ఒక్కక్కరిగా.. తమ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. కానీ, దానికి గల కారణం ఎవరు అనే విషయాలు మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ విధానం అనేది చాలా విచారించ తగిన విషయం. ఇక తమ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి వారి చేదు అనుభవాలను బయట పెట్టుకోలేని.. నటీ మణులు ఎంతో మంది ఉన్నారు. మరి ‘అదితి గోవిత్రికర్’, ‘సుచిత్రా కృష్ణమూర్తి’ వారి వ్యక్తిగత సంఘటనల గురించి తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom