iDreamPost
android-app
ios-app

సు ఫ్రమ్ సో OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Sep 02, 2025 | 1:25 PM Updated Updated Sep 02, 2025 | 1:25 PM

తెలుగు సినిమాలు సంగతి ఎలా ఉన్నా.. ఈ మధ్య ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో సు ఫ్రమ్ సో కూడా ఒకటి. ఈ సినిమాకు కన్నడలో మంచి రెస్పాన్స్ రావడంతో.. వెంటనే తెలుగులో మైత్రి వారు తెలుగులో రిలీజ్ చేశారు

తెలుగు సినిమాలు సంగతి ఎలా ఉన్నా.. ఈ మధ్య ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో సు ఫ్రమ్ సో కూడా ఒకటి. ఈ సినిమాకు కన్నడలో మంచి రెస్పాన్స్ రావడంతో.. వెంటనే తెలుగులో మైత్రి వారు తెలుగులో రిలీజ్ చేశారు

  • Published Sep 02, 2025 | 1:25 PMUpdated Sep 02, 2025 | 1:25 PM
సు ఫ్రమ్ సో OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలుగు సినిమాలు సంగతి ఎలా ఉన్నా.. ఈ మధ్య ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో సు ఫ్రమ్ సో కూడా ఒకటి. ఈ సినిమాకు కన్నడలో మంచి రెస్పాన్స్ రావడంతో.. వెంటనే తెలుగులో మైత్రి వారు తెలుగులో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ప్రతి చోట మూవీకి మంచి రెస్పాన్స్ ఏ దక్కింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అసలు ఈ మూవీ కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ మారుమూల గ్రామంలో రవన్న పెద్దరికం వహిస్తూ అందరికి తలలో నాలుకలా ఉండేవాడు. మరో వైపు అదే ఊరిలో ఉండే అశోక్ ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయితో మాట్లాడాలని రోజు ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో అతన్ని దొంగ అనుకుని ఊరంతా ప్రచారం జరిగిపోతుంది. దీనితో దానిని డైవర్ట్ చేయడానికి అతనికి సులోచన అనే దెయ్యం పట్టినట్టు నటించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది ? అశోక్ దీని నుంచి బయట పడ్డాడా లేదా ? అసలు నిజంగా సులోచన అనే దెయ్యం ఉందా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సు ఫ్రమ్ సో కన్నడ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమా మిస్ అయినవారు అసలు మిస్ చేయకుండా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.