iDreamPost
android-app
ios-app

స్పిరిట్ లో మెగా సర్ప్రైజ్.. ఎంత వరకు నిజం !

  • Published Sep 29, 2025 | 9:56 AM Updated Updated Sep 29, 2025 | 9:56 AM

ప్రభాస్ లిస్ట్ నుంచి రాబోయే సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే డార్లింగ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తుంది రాజాసాబ్ కోసమే. చాలా సార్లు రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఫైనల్ డేట్ ను జనవరికి ఫిక్స్ చేశారు. ఈ సారి రిలీజ్ డేట్ ను ఎలాంటి చేంజ్ ఉండదు అనే అనుకుంటున్నా

  • Published Sep 29, 2025 | 9:56 AMUpdated Sep 29, 2025 | 9:56 AM
స్పిరిట్ లో మెగా సర్ప్రైజ్.. ఎంత వరకు నిజం !

ప్రభాస్ లిస్ట్ నుంచి రాబోయే సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే డార్లింగ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తుంది రాజాసాబ్ కోసమే. చాలా సార్లు రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఫైనల్ డేట్ ను జనవరికి ఫిక్స్ చేశారు. ఈ సారి రిలీజ్ డేట్ ను ఎలాంటి చేంజ్ ఉండదు అనే అనుకుంటున్నారు. కానీ రిలీజ్ అయ్యేవరకు కాస్త సందేహమే. అయితే ఈలోపు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయడానికి రెండు ట్రైలర్స్ ను రెడీ చేయనున్నారట మేకర్స్. ఇక ఈ ఇసినిమా కాకుండా ప్రభాస్ సినిమాలలో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమాలో ఒకటి స్పిరిట్.

సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనితో ఫ్యాన్స్ ఇంకాస్త ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఓ రకంగా ఇది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు కూడా ఉన్నారని.. టాక్ వినిపిస్తుంది. అప్పట్లో ఓ మెగా సర్ప్రైజ్ అనే రూమర్ వినిపించింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది రూమర్ కాదనే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి ప్రభాస్ కు తండ్రిగా నటించనున్నారట.ప్రస్తుతానికి దీని గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.