Nagendra Kumar
పెళ్ళైనా, పిల్లలున్నా సరే తాను మాత్రం తమిళ కథానాయకుడు మాధవన్ మీద క్రష్ ని చంపుకోలేకపోతున్నానని స్టార్ సింగర్ స్వయంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పెళ్ళైనా, పిల్లలున్నా సరే తాను మాత్రం తమిళ కథానాయకుడు మాధవన్ మీద క్రష్ ని చంపుకోలేకపోతున్నానని స్టార్ సింగర్ స్వయంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nagendra Kumar
ఇవ్వాళా,రేపూ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. కట్టుబాట్లు, సంప్రదాయాలు దాటి మాట్లాడడం, సోషల్ మీడియాలో సంచలనంగా మారడం.. ప్రస్తుతం వాక్ స్వాతంత్ర్యం కొత్త నిర్వచనం. ఈ మధ్యనే ఓ ముద్దుగుమ్మ పెళ్ళైనా, పిల్లలున్నా సరే తాను మాత్రం తమిళ కథానాయకుడు మాధవన్ మీద క్రష్ ని చంపుకోలేకపోతోందట. ఈ విషయాన్ని సదరు ముద్దు గుమ్మే చెప్పింది. టాలీవుడ్ టాప్ సింగర్ శ్వేతా మోహన్ గురించి కొత్తగా ఇప్పుడు పరిచయాలు, ఉపోద్ఘాతాలు అక్కర్లేనంత బండెడు పాప్యులారిటీ ఉన్న ప్రముఖ గాయని.
అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి, దేశమొత్తం మీద తిరుగులేని పాప్యులారిటీని తెచ్చుకున్న బ్యూటీ శ్వేతమోహన్. తెలుగులో వస్తున్న సూపర్ సింగర్ షోకి కూడా ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఉత్తమ నేపథ్య గాయనిగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, వాటితో పాటుగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, తమిళ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకుని, తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో క్షణం తీరిక లేకుండా ఉన్న పాప్యులర్ సింగర్ శ్వేతా మోహన్. ఈమెతో పాటు గీత రచయిత అనంత్ శ్రీరామ్, సింగర్స్ మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ టీం లీడర్లుగా, న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ షోలు చేస్తున్నారు.
ఇటువంటి ఫైరింగ్ పాప్యులారిటీ ఉన్న ఐకాన్ ఒక మాట అందంటే అది దావానంలా కమ్ముకుంటుంది. ఈమెకు ఈ మధ్యన సింగింగ్ కన్నా కూడా మాధవన్ మీద చంపుకోలేని వ్యామోహాన్ని ఒలకబోసినప్పుడు మరింత ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాకి ఇంతకన్నా బెస్ట్ ఫుడ్ ఇంకేముంటుంది? తనకి పదోతరగతి చదువుతున్నప్పటి నుంచి హీరో మాధవన్ అంటే మహాపిచ్చని, విపరీతమైన క్రష్ అని చెప్పుకొచ్చింది. ఇలా షాకింగ్ కామెంట్లు చేయడంతో పాటల మాట దేవుడెరుగు.. శ్వేతా మోహన్ హెడ్ లైన్స్ లోకి సునాయాసంగా ఎక్కి కూర్చుంది. మాధవనే తన గుండె అంటూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కళాకారులు ఒకరిని ఒకరు అభిమానించుకోవడం, వారి పట్ల ఆరాధనా భావాన్ని మనసులో నిలుపుకోవడం కళకు నిజమైన నిదర్శనం. కానీ క్రష్ అన్నమాటకి తెలుగులో వేరే అర్ధముంది. అదంత పబ్లిగ్గా మాట్లాడేది కాదు. అయితే ఇవన్నీ బాలీవుడ్ లో, ముఖ్యంగా నటీనటుల్లో సర్వసాధారణం. అమితాబ్ అంటే హీరోయన్లకు ఎంత పిచ్చో హీరోయిన్ల అందరి మాటలతో ఫిల్మ్ ఫేర్ లాంటి పాప్యులర్ మేగజైన్ ఏకంగా ఒక స్పెషల్ ఎడిషనే పబ్లిష్ చేసింది. ఒక్క కాపీ మిగల్లేదు మార్కెట్లో. కానీ లతామంగేష్కర్ గానీ, సుశీల గానీ, జానకి, వాణీ జయరాం లాంటి దిగ్గజాలు ఏనాడు ఎవరి మీద క్రష్ ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. పాటని పవిత్రంగా భావించి, సంగీత సరస్వతులుగా చరిత్ర రాసిన మహనీయులు వాళ్ళు. ఇప్పుడిదో వింత లోకం.
ఇదికూడా చదవండి: OTT లో బ్రీత్ మూవీకి సూపర్ క్రేజ్! ఎగబడి చూస్తున్నారు!