iDreamPost
android-app
ios-app

దీపికా పిల్లితో పిక్ షేర్ చేసి షాక్ ఇచ్చిన స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు

బుల్లితెరపై హోస్టులుగా ఆకట్టుకున్న యాంకర్స్.. బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు ప్రదీప్ మాచిరాజు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోగా మారిన ప్రదీప్.. ఇప్పుడు..

బుల్లితెరపై హోస్టులుగా ఆకట్టుకున్న యాంకర్స్.. బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు ప్రదీప్ మాచిరాజు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోగా మారిన ప్రదీప్.. ఇప్పుడు..

దీపికా పిల్లితో పిక్ షేర్ చేసి షాక్ ఇచ్చిన  స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు

గడసరి అత్త, సొగసరి కోడలు, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ విలక్షణమైన యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళాభిమానులకు చేరువయ్యాడు ప్రదీప్ మాచిరాజు. స్మాల్ స్క్రీన్ పై ఉమెన్ యాంకర్లదే హవాగా కొనసాగుతున్న సమయంలో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన యాంకరింగ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తన వాక్చాతుర్చంతో, అద్బుతమైన టైమింగ్‌తో షోలకు అందాన్ని తెచ్చాడు. బుల్లితెరపై సందడి చేస్తూనే బిగ్ స్క్రీన్‌పై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరోగా మారాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో కథానాయకుడుయ్యాడు. అలా అని యాంకరింగ్ వదిలిపెట్టలేదు. రెండింటిని మేనేజ్ చేస్తున్నాడు ఈ స్టార్ యాంకర్. అయితే కొన్ని రోజుల నుండి ప్రదీప్ కనిపించడం లేదు. బిగ్ స్క్రీన్ లేదా స్మాల్ స్క్రీన్, చివరకు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు. దీంతో యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది..? ఏమైపోయాడు అని టెన్షన్ పడ్డారు ఫ్యాన్స్.

అభిమానుల ఆందోళన మధ్య సర్ ప్రైజ్ ఇచ్చాడు ప్రదీప్ మాచిరాజు. హీరోగా తన సెకండ్ మూవీని సైలెంట్‌గా ఎనౌన్స్ చేశాడు. ఈసారి కూడా పక్కా లవ్ స్టోరీతో రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఫస్ట్ మూవీ టైటిత్‌తో వచ్చేస్తున్నాడు ఈ స్టార్ యాంకర్. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమా మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో జబర్థస్త్ ఫేమ్ దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది.అందమైన గ్రామం.. పదునైన ఆయుధాలు చేతబట్టిన గ్రామస్థులు.. క్లాస్ రూంలో ప్రదీప్.. ఇంట్లో హీరోయిన్ దీపికా పిల్లిని మోషన్ పోస్టర్‌లో చూపించింది చిత్ర యూనిట్. ఈ విజువల్స్‌తో కట్‌ చేసిన ఈ మోషన్‌ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. మాంక్స్ అండ్ మంకీస్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేం రధన్ బాణీలు సమకూరుస్తున్నాడు. నితిన్‌ – భరత్ స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో థియేటర్లలోకి రానుంది.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో కూడిన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఇక్క‌డ అమ్మాయి అక్క‌డ అబ్బాయి మూవీని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్ర‌దీప్ మాచిరాజు సివిల్ ఇంజినీర్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించబోతున్నాడట. ఉద్యోగ రీత్యా ఓ ఊరికి వచ్చిన ప్రదీప్.. అక్కడ పల్లెటూరి అమ్మాయి ప్రేమలో పడతాడు. తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఆ ఇంజనీర్ పడే కష్టాలే.. ఈ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఈ ఇద్దరు బుల్లితెర స్టార్ యాంకర్స్.. హీరో హీరోయిన్లుగా వెండితెరపై రొమాన్స్ చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు ఢీ షోలో కనిపించారు. అక్కడ ఆకట్టుకున్న ఈ జంట.. బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రదీప్ మాచిరాజు కెరీర్ విషయానికి వస్తే..  వరుడు, 100% లవ్, అత్తారింటికి దారేదీ చిత్రాల్లో స్మాల్ రోల్ చేశాడు. హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఆఫర్ వచ్చింది. ఈ చిత్రం విడుదలై ప్రదీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ..సక్సెస్ అందుకోలేకపోయాడు.  ఇప్పుడు పవర్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయితో రాబోతున్నాడు. ఈ సినిమా బిగ్ హిట్ ఇచ్చి.. బిజియెస్ట్ హీరోగా మారాలని ఆశిద్దాం.