Swetha
రాజమౌళి ఓ సినిమా తీసే ముందు.. కచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. కానీ SSMB29 విషయంలో మాత్రం ఈ పద్దతి ఫాలో అవ్వలేదు. దానికి సంబందించిన ప్రతి డిటైల్ ను చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నాడు. కానీ వచ్చే లీకులు వస్తూనే ఉన్నాయి. మహేష్ బర్త్ డే సంధర్బంగా ఓ పోస్టర్ ను వదిలి అసలైన అప్డేట్ నవంబర్ లో ఇస్తాం అని అనౌన్స్ చేశారు

రాజమౌళి ఓ సినిమా తీసే ముందు.. కచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. కానీ SSMB29 విషయంలో మాత్రం ఈ పద్దతి ఫాలో అవ్వలేదు. దానికి సంబందించిన ప్రతి డిటైల్ ను చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నాడు. కానీ వచ్చే లీకులు వస్తూనే ఉన్నాయి. మహేష్ బర్త్ డే సంధర్బంగా ఓ పోస్టర్ ను వదిలి అసలైన అప్డేట్ నవంబర్ లో ఇస్తాం అని అనౌన్స్ చేశారు. దీనితో ఆ అప్డేట్ దేని గురించి ఉంటుందా అని అందరికి ఆరాలు మొదలయ్యాయి. పైగా సినిమాకు ఇప్పటివరకు ఓ టైటిల్ లాక్ చేయలేదు. బహుశా ఆరోజున టైటిల్ అనౌన్సమెంట్ ఉండినా ఉండొచ్చు.
మొన్నీమధ్యనే ఓసారి ఈ సినిమా టైల్ మహారాజ్ అని అన్నారు. ఆ తర్వాత జెన్ 63 అనే ఓ పేరు బయటకు వచ్చింది. ఈ వార్తలు అంతగా పాపులర్ అవ్వలేదు కానీ. ఇప్పుడు ఓ కొత్త టైటిల్ ‘వారణాసి’ అని అనుకున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. కథకు సంబంధించి కాశీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.. ఆ పేరు పెట్టాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. కానీ రాజమౌళి టీం నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. సో ఇది ఇంకా ఫైనల్ కానట్టే. ఆర్ఆర్ఆర్ టైం లో కూడా మొదట దానిని వర్కింగ్ టైటిల్ గా పెట్టుకుని ఆ తర్వాత.. దానినే ఫైనల్ చేశారు.
ఆ లెక్కన ఈ వారణాసి టైటిల్ ను ఖాయం చేసినా ఆశ్చర్యం లేదు. కానీ నమ్మకాలు లేవు. నవంబర్ లో రాజమౌళి మీడియా ముందుకు వచ్చి సినిమాకు సంబందించిన విషయాలను రివీల్ చేయబోతున్నారు. సో అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. ఈసారి రాజమౌళి కనుక రాకపోతే ఎవరో ఒకరు ఇదే SSMB కథ అని పుకార్లు సృష్టించిన ఆశ్చర్యం లేదు. సో ఈ సస్పెన్స్ కొద్దిరోజుల పాటు ఇలానే కొనసాగనందు. 2027 రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు జక్కన్న. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.