iDreamPost
android-app
ios-app

కర్ణాటక 10th ఫలితాల్లో అద్భుతం! రైతు కూతురికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్!

  • Published May 09, 2024 | 6:04 PM Updated Updated May 10, 2024 | 9:46 AM

కర్ణటాకలోని ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ పరీక్షల్లో ముధోల్‌లోని మెల్లిగేరి మొరార్జీ దేశాయ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన అంకిత విద్యార్థిని అత్యధిక మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది. ఇక ఈమె ఒక పేదింటి రైతు బిడ్డ కావడం గమన్హారం.

కర్ణటాకలోని ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ పరీక్షల్లో ముధోల్‌లోని మెల్లిగేరి మొరార్జీ దేశాయ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన అంకిత విద్యార్థిని అత్యధిక మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది. ఇక ఈమె ఒక పేదింటి రైతు బిడ్డ కావడం గమన్హారం.

  • Published May 09, 2024 | 6:04 PMUpdated May 10, 2024 | 9:46 AM
కర్ణాటక 10th ఫలితాల్లో అద్భుతం! రైతు కూతురికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్!

విద్యార్థి దశలో ఉన్నవారికి కలలు కనడం వాటిని నెరవేర్చుకోవడం అనేది అంత సులభం కాదు. అందులోనూ పేదరికంలో పుట్టినవారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందులో అమ్మాయిలు ఎదుర్కొన ఇబ్బందులు, సవాళ్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక వీరికి బంగారు భవిష్యత్తును అందించలనే ఆలోచనతో.. వారి తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి చెమట చెందించి వారికి మంచి విద్యను అందిస్తారు. ఇక నేటి తరం పిల్లలు కూడా తల్లిదండ్రులు పడే కష్టలను పారదోలాలంటే.. తాము కూడా చదువుల్లో మంచిగా రాణించి.. భవిష్యత్తులో ఏదో ఒకటి సాధించాలనే ధృడ సంకల్పంతో ఉంటారు.

ఈ క్రమంలోనే పేదరికంపై పోరాటం చేస్తునే.. తమ పిల్లలను ఒక స్థాయికి చేర్చడానికి పరితపించిన తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చుతూ.. వారు గర్వపడేలా చేస్తుంటారు.ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటకలోని ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ పరీక్షల్లో ముధోల్‌లోని మెల్లిగేరి మొరార్జీ దేశాయ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన అంకిత బసప్ప విద్యార్థిని అత్యధిక మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది. ఇక ఈమె ఒక పేదింటి రైతు బిడ్డ కావడం గమన్హారం. అయితే ఈ పరీక్షల్లో 625కి మార్కులకు 625 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచి అందరీ దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసింది. ఈ క్రమంలోనే అంకిత తన విజయ రహస్యాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా స్కూల్ టాపర్ అంకిత మాట్లాడతూ.. నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. పైగా నాకు ఏదైనా విషయంపై సమాచారం తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ కూడా లేదు.

కానీ, మీకు ఏదైనా విషయంపై సమాచారం కావాలంటే.. మీరు దానిని YouTubeలో చూడవచ్చు. ఎందుకంటే.. ఈరోజుల్లో చదవడానికి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ రెండూ అవసరంఅనే కాన్సెప్ట్‌ను అర్థం చేసుకొని చదివితే కచ్చితంగా పరీక్షల్లో మార్కులను సులభంగా పొందవచ్చు అని తెలిపారు. ఇక భవిష్యత్తులో అంకిత కొన్నూర్‌కు ఐఏఎస్‌ అధికారి కావాలనే కలలు కంటున్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సమాజం కోసం ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్న అని పేర్కొంది. అయితే ఓ పేదింట కుటుంబంలో కుసుమంగా మెరిసి, చదువుల్లో చక్కగా రాణించి నేడు అత్యధిక మార్కులతో స్టేట్ ఫస్ట్ గా నిలిచిన అంకిత పై పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ప్రశసింస్తున్నారు. ఇక ఒక రైతు బిడ్డ ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించడం అనేది నిజంగా గర్వంగా ఉందంటూ పలువురు కొనియాడారు. మరి, అత్యధిక మార్కులతో స్టేట్ ఫస్ట్ గా నిలిచిన రైతు బిడ్డ అంకిత పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.