iDreamPost
android-app
ios-app

OM BHEEM BUSH: దర్శకుడి చేతిలో నుంచి మైక్ లాక్కున్న శ్రీ విష్ణు

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చాలా సరదాగా, హుషారుగా, ఫుల్ జోష్ గా జరిగింది. కథలో మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ ముందుగానే చెప్పేస్తున్నావు.

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చాలా సరదాగా, హుషారుగా, ఫుల్ జోష్ గా జరిగింది. కథలో మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ ముందుగానే చెప్పేస్తున్నావు.

OM BHEEM BUSH: దర్శకుడి చేతిలో నుంచి మైక్ లాక్కున్న శ్రీ విష్ణు

ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చాలా సరదాగా, హుషారుగా, ఫుల్ జోష్ గా జరిగింది. ధియేటర్ ఫుల్లుగా ఫాన్స్ అండ్ యూత్ నిండిపోయారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, నిర్మాతలలో ఒకరైన సునీల్ ధియేటర్లోకి రాగానే ధియేటర్ మామ్మూలు కోలాహలం చెలరేగలేదు. వాళ్ళు తలో నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత మీడియా ఇంటరాక్షన్ ప్రారంభమైంది.

మీడియా క్వశ్చన్స్ కి సమాధానాలు చెబుతూ, మధ్యమధ్యలో జోకులు, బోలెడు కామెడీతో చాలా ఇంట్రస్ట్ క్రియేట్ అయింది., దర్శకుడు హర్ష ని ‘’ No Logic Only Magic’’ అని టైటిల్ కి ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే రేపు సినిమా విడుదలైన తర్వాత రివ్యూలు రాసేటప్పుడు ఇందులో లాజిక్ మిస్ అయింది లేదా లాజిక్ లేకుండా దర్శకుడు అలా ఎలా చూపిస్తాడు అని రాయడానికి వీలు లేకుండా ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నారా అని ఐ డ్రీమ్ అడిగింది.

OM bheem Bhush

దానికి ఒక్కసారిగా ధియేటర్ నవ్వులతో నిండిపోయింది. హర్ష మెల్లగా స్పందిస్తూ అటువంటిదేమీ లేదని, గ్యారెంటీగా మేజిక్కే ఉంటుంది సినిమాలో అది లాజికల్ గానే ఉంటుందని సమాధానం చెప్పాడు. మరి ఈ మధ్య రోజుల్లో రెగ్యులర్ సినిమాలను పూర్తిగా ఆడియన్స్ తిప్పికొడుతున్నారు కదా మీ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఏదో ఇండియన్ స్క్రీన్ మీద రాని పాయంట్ ఇందులో ఉందని చెబుతున్నారు కదా, అదేమిటని మళ్ళీ ఐ డ్రీమ్ అడిగింది. దానికి హర్ష కొంచెం బాగానే రియాక్ట్ అయి, ఇందులో పురాతన మంత్రగాళ్ళు….అని అనబోతుంటే, హీరో శ్రీ విష్ణు స్పాటులో హర్ష చేతిలోనుంచి మైకు లాగేసుకున్నాడు. ‘’ కథలో మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ ముందుగానే చెప్పేస్తున్నావు. వాళ్లే తెలివితేటలుగా ప్రశ్నించి లాగుతున్నారు. నువ్వేమో ఆగడం లేదు’’ అని తను మైకు లాక్కుని చెప్పాడు.

నిజమే మరి. కష్టపడి రాసుకున్న కథలో మెయిన్ పాయంట్ చెప్పేస్తే, షాక్ వేల్యూ పోతుంది కదా. అందుకే శ్రీ విష్ణు సమయానికి రియాక్ట్ అయ్యాడు కానీ, లేకపోతే ఉత్సాహంలోనో, ఒత్తిడిలోనో హర్ష అసలు విషయం బైట పెట్టేసేవాడే.