iDreamPost
android-app
ios-app

Bhala Thandanana శ్రీవిష్ణు – పెద్ద రిస్కే ఇది

  • Published Apr 22, 2022 | 2:50 PM Updated Updated Apr 22, 2022 | 2:50 PM
  • Published Apr 22, 2022 | 2:50 PMUpdated Apr 22, 2022 | 2:50 PM
Bhala Thandanana శ్రీవిష్ణు – పెద్ద రిస్కే ఇది

నిన్న రాత్రి ఉన్నట్టుండి శ్రీవిష్ణు కొత్త సినిమా భళా తందనాన రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో వింతేమి అనుకోకండి. ఎందుకంటే సరిగ్గా ఒక్క రోజు ముందు 29న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య భారీ ఎత్తున విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ రేంజ్ బజ్ లేకపోయినా ఆ టైంకంతా హైప్ వచ్చేస్తుంది. అయినా మెగా మూవీకి ప్రత్యేకంగా పబ్లిసిటీ అక్కర్లేకపోయినా ఉండాల్సిన స్థాయిలో దీని మీద అంచనాలు లేవనే అసంతృప్తిలో అభిమానులు ఉన్నారు. రేపు హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మార్పు ఉంటుందేమో చూడాలి.

ఆచార్య వచ్చిన నెక్స్ట్ డేనే భళాతందనానా బరిలో దిగడం శ్రీవిష్ణుకి మార్కెట్ పరంగా రిస్కే. ఎందుకంటే టాక్ తో సంబంధం లేకుండా చిరు చరణ్ ల కాంబినేషన్ ఎంతలేదన్నా కనీసం ఓ వారం రోజుల పాటు జనాన్ని థియేటర్ల దాకా రప్పించగలుగుతుంది. అలాంటిది భళా తందనాన లాంటి చిన్న మూవీ క్లాష్ అవ్వడం అంత సేఫ్ కాదు. మరి దర్శక నిర్మాతల ధైర్యం ఏమిటో కంటెంట్ చూస్తే కానీ అర్థం కాదు. అసలే శ్రీవిష్ణుకి ఈ మధ్య కాలంలో హిట్ లేదు. అంతో ఇంతో అంచనాలు పెట్టుకుని బిల్డప్ ఇచ్చిన అర్జున ఫల్గుణ తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడీ టైటిల్ కూడా అదే సౌండింగ్ లో వినిపిస్తోంది కానీ జానర్ వేరుగా ఉంది.

చిన్న సినిమాలకు థియేటర్ దాకా జనం వచ్చేందుకు అంతగా ఇష్టపడటం లేదని లెక్కలు చెబుతున్నాయి. చాలా బాగుందనే ఎక్స్ ట్రాడినరీ టాక్ వస్తే తప్ప ఇవి సేఫ్ కావడం లేదు. అలాంటిది ఒకపక్క ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లు కంటిన్యూ అవుతున్న టైంలో ఆచార్య రిలీజైన నెక్స్ట్ డే ఇలా సాహసం చేయడం చూస్తే భళా తందనాన టీమ్ లో గట్టి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. వారాహి సాయి కొర్రపాటి నిర్మించిన ఈ యాక్షన్ కం థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ కు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. క్యాథరిన్ త్రెస్సా హీరోయిన్. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఆచార్యకు సంగీతం అందించిన మణిశర్మే దీనికీ మ్యూజిక్ ఇవ్వడం విశేషం.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş